Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 13.04.2021

దిన ధ్యానము(Telugu) 13.04.2021

తల్లి మరచినను.

"స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను" - యెషయా 49:15

కేరళ రాష్ట్రం పాలకాడ్ లో 1999 వ సంవత్సరం వీధుల్లో తిరుగుతున్న బాలుడ్ని పోలీసులు పట్టుకొని ప్రశ్నించారు. తన పేరు అబయ్ అనియు తండ్రి పేరు అంథోని అనియు సొంత ఊరు బెంగళూరు అని చెప్పాడు. సరైన వివరాలు లేనందున అతనిని కోర్టులో హాజరు పరిచారు. ఆ న్యాయమూర్తి అతనిని పిల్లల హాస్టల్ లో చేర్పించమని తీర్పు ఇచ్చారు. 

న్యూస్ పేపర్లో ఈ వార్తను చూసిన సుశీల అనే స్త్రీ తన కుమారుడే అబయ్ అనియు మా అత్తయ్య నా బిడ్డను నా నుండి దూరం చేసి తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి ఆ బాలుడ్ని తీసుకు వెళ్లారు. 2 సంవత్సరాలు అబయ్ సుశీల యొద్ద ఎదిగాడు. ఆమె మరల అబయ్ ను పాలకాడ్ కోర్టుకు తీసుకు వచ్చి ఆయనను తప్పిదముగా నా కుమారుడు అని చెప్పి తీసుకు వెళ్ళిపోయాను నా భర్త పేరు అంథోని ఊరు బెంగళూరు కాబట్టి తప్పిదముగా తీసుకు వెళ్ళిపోయాను. నా కుమారుడు బెంగళూరులో ఎదుగుతున్నడు అని ఒక ఫోటో చూపించి నాది పొరపాటై పోయింది నన్ను క్షమించండి అని కోర్టులో ఆ బాబును అప్పగించారు. కనిపించక పోయినప్పటికీ వీధుల్లో తిరిగిన దినాల్లో ఈ చిన్న బాలుడు ఏడవలేదు. కాని 2 సంవత్సరాలు తల్లి ప్రేమను అనుభవించి ఇప్పుడు ఆ తల్లి నుండి వేరుగా ఉండలేక బిగ్గరగా ఏడ్చాడు. హృదయాన్ని కదిలించే ఈ సంఘటన చూచిన న్యాయమూర్తి ఈయనను నీ కుమారుడిగా భావించి పెంచ కూడదా అని అడిగిన వెంటనే ఆమె జవాబు ఏమి చెప్పకుండా వెళ్లిపోయారు. అబయ్ మరల హాస్టల్ కి పంపించబడ్డాడు. 

తల్లిదండ్రులు చేత తిరస్కరించబడిన చిన్నారులు ప్రపంచమంతా వేల కొలదిగా ఉన్నారు. ఎందుకు అంటే తల్లిదండ్రులకు దాయలేకపోవడం, తమ సుఖ వంతమైన జీవితం కొరకు తమ పిల్లలను చంపేసే వారు కూడా కలరు. పేదరికంలో తాను కనిన పిల్లల్ని అమ్ముటకు తెగిస్తున్నారు ఇలాంటి సంఘటనలు మనము రోజు న్యూస్ పేపర్లో, టి.వి లో చూస్తూనే ఉన్నాం. 

కాని ప్రేమ స్వరూపి అయిన మన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనను  ప్రేమించి, విశ్వసించి ఆయనతో కలిసి నడుస్తున్న తన పిల్లలను ఎన్నడు చేయి విడచుటకు తెగించారు. నాకు ప్రియమైన వారలారా మనల్ని ఎన్నడూ మరువకుండ ఎత్తి పట్టుకొని మోస్తూ సంరక్షిస్తున్న దేవుడు మనతో ఉన్నారు అనే నిశ్చయతతో ఆయనను స్తుతించి మహిమ పరచి జీవిద్దాం. దేవుని కృప మనలను నడిపించును గాక!
-    శ్రీమతి. సరోజ మోహన్ దాస్

ప్రార్థన అంశం:-
నూతనముగా ఈ దర్శనంతో కలసి పనిచేయుటకు సమర్పించబడే సేవకులను దేవుడు మనతో ఐక్య పరచేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)