Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 12.04.2021

దిన ధ్యానము(Telugu) 12.04.2021

అలకించుము:-

"మీ హృదయములను కఠినపరచుకొనకుడి.” - కీర్తనలు 95: 8

మహా అలెక్జాండర్ యుద్ధం చేసి అనేక దేశములను తన సొంతం చేసుకున్నారు. ఒక మారు యుద్ధం ముగించుకొని విశ్రాంతి కొరకు గుడారములో ఉండగా తన గుర్రం గుడారాన్ని విడిచి మార్కెట్ లోనికి వెళ్ళిపోయింది. దొరికొన వాటిని తిని ఒక షాప్ ముందు పడుకుంది. అందువలన ఆ షాప్ కి ఎవ్వరు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. అది అలెక్జాండర్  గుర్రం కాబట్టి ఎవ్వరు దానిని తరుముటకు ముందుకు రాలేదు. కాబట్టి ఆ షాప్ యజమాని ఒక గంటను తీసి తన చెవిలో ఊపడం ప్రారంభించారు కాని ప్రయోజనం లేకపోయింది. ఈ లోగా గుర్రాన్ని వెతుకుతూ ఇద్దరు సైనికులు వచ్చి ఆ షాప్ అతను దాని చెవిలో గంటను ఊపుతుండటం చూసి నవ్వుతూ అయ్యా ఈ గుర్రం భయంకరమైన ఫిరంగిలు, బాంబులు, గొప్ప ఆయుధముల శబ్దములు విని బయపడలేదు మరి ఈ యొక్క చిన్న గంట శబ్దమునకు లేస్తుందా అని చెప్పి గుర్రాన్ని లేపి తీసుకొని వెళ్లిరి. 

ఇజ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళను పరిపాలించే రాజులు పాపము చేస్తున్నప్పుడు దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ప్రతి సారి మాట్లాడుతూ, హెచ్చరిస్తూ వచ్చారు. కాని వారు తమ జీవితములను మార్చుటకు ఇష్టపడలేదు. మేము అరణ్యంలో దేవుని స్వరమునకు చెవి యొగ్గ లేదు అని ప్రవక్తల మాటలకు లోబడుతూ మెడ వంచని ప్రజలుగా ఉంటున్నారు. అందువలన వారు దేవుని కోపమునకు గురైనారు.

ప్రియమైన వారలారా! మనము కూడా ముందు దేవుని సందేశములను దేవాలయములోను, కూడికలోనూ వినే వారము కాని ఇప్పుడైతే ఫేస్ బుక్  , యూట్యూబ్ అని సోషల్ మీడియాలో దేవుని సందేశాన్ని విస్తారముగా వినగలుగుతున్నాం. అయితే అది మంచిదే  కాని దాని వలన ఒక ప్రమాదం కలదు. వాక్యాన్ని అనేక విధములుగా విని సత్యాన్ని గ్రహించే గ్రహింపు వస్తుందా లేదా వాటిని విన్న తరువాత హృదయము గ్రహింపు లేనిదిగా మారిపోతున్నదా? దీనిని చదువుతున్న మనము కూడా దేవుని మాటలు విని విని హృదయములో మార్పు లేకుండా అలెక్జాండర్ గుర్రం వలె వుంటున్నామా అలోచిద్దాం. మన హృదయ కఠిన్యత, గ్రహింపు లేనితనం, విధేయత లేకుండా ఉంటే మనలను మనమే పరిశీలించి చూద్దాం. ఎంత దేవుని సందేశాన్ని వింటున్నామో అన్నది ప్రాముఖ్యత కాదు ఆయన మాటలకు చెవియొగ్గుతున్నమా లేదా అన్నది ప్రాముఖ్యం. మనము ఈ దినమే దేవుని స్వరమునకు చెవి యొగ్గుదాం దేవుని దీవెనలు సొంతం చేసుకుందాం.
-    శ్రీమతి. అనిత అలగర్ సామి

ప్రార్థన అంశం:-
సేవకులు ఉండుటకు గదులు కట్టుటకు అవసరమైన ధన సహాయము అందేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)