Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 11.04.2021 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 11.04.2021 (Kids Special)

"వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను" - లూకా 18:1

ఒక అందమైన చిన్న గ్రామం అది, ఆ గ్రామం చుట్టూ ఎక్కడ చూసినా తెల్ల రంగులతో గల మేఘాలు చిరునామాలను వెతుకుతూ తిరుగుతున్నట్లు తెల్లటి దూదివలె ఎగురుతూ ఉన్నాయి. దృష్టిని ఆకర్షించే రంగుల్లో ఎర్ర రంగులో, పచ్చరంగులో గుత్తులు గుత్తులుగా  మిరపకాయలు కాస్తూ నిండియున్న తోట, ఆ గ్రామంలో ఎప్పుడు జాలీగా ఉంటున్న ఒక తమ్ముడు రాజు ఆయన ఎప్పుడూ తన తల్లిదండ్రులతో నివసించ వచ్చాడు. తన తల్లిదండ్రుఅనేక సంవత్సరాల తరువాత మొక్కుబడి చేసి అతనిని కన్నారు. తన పేరుకు తగినట్టుగానే మంచి పిల్లాడుగా ఉండేవాడు. ఇలా ఉండగా చిన్న చిన్నగా తనలో కౄరమైన గుణ లక్షణాలు రావడం ప్రప్రారంభించాయి. చిన్న వయసులోనే చెడు (మాదకద్రవ్యాలను) అలవాట్లు అలవాటుచేసుకున్నాడు. గొడవలు వస్తే పెద్దవాళ్ళ అనికూడా చూడకుండా కొట్టుటకు చంపుటకు కూడా వెనకడుగు వేసేవాడుకాదు ఇలాగు చిన్న వయసులోనే దుర్మార్గపు జీవితాన్ని జీవించ వచ్చాడు. 

పెద్దవాడైనప్పటికి ఆయన ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఆయన తల్లిదండ్రులు ఈయన గురించి మిక్కిలి వేదన చెందేవారు. తన యొక్క కుమారుని కొరకు తల్లి రోజు ప్రార్ధన చేసేవారు. ఆ తల్లి యొక్క ప్రార్దన విన్న దేవుడు ఒక దినము రాజుని  దర్శింఉంచారు. ఆ దినము ఆయనలో ఒక పెద్ద పోరాటం ఏర్పడింది. ఎందుకు తాగాలి ఎందుకు ఈ పాపపు అలవాట్లలో జీవించాలి? అని అనేక ప్రశ్నలు ఆయనలో కలిగాయి. పశ్చాత్తాపం చెందిన వాడుగా తన జీవితాన్ని  యేసయ్యకి సమర్పించాడు. తన గ్రామాన్ని విడిచి వేరే దేశానికి వెళ్లి మంచిపనులను చేయడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న దేవాలయమునకు వెళ్లడం ప్రారంభిచాడు. దేవుని ప్రేమచేత నింపబడిన  వాడిగా యేసుక్రీస్తు ప్రేమతో నిండియున్నఆయన కాలీగ ఉండలేకపోయాడు. పిచ్చివాడి వాలె ఆకలి మరచి, నిద్రను మాని  నన్ను మార్చిన యేసయ్య కొరకు నేను ఏమైనా చేయాలి అని ప్రతి రోజు ఒకరికైనా సువార్త ప్రకటించాలి అనే దప్పిక ఆయనలో విస్తారముగా ఉండేది. పని ముగించుకొని అలసిపోయిన వాడిగా తన గదికి వచ్చినప్పటికి ఆయన కాలీగ ఉండలేకపోయేవాడు. అవసరమైన ప్రజలను వెతకి సువార్త ప్రకటించారు. ప్రస్తుతం తన పనిని విడిచిపెట్టి సంపూర్ణ మిషనరీగా తనను సమర్పించుకొని దేవుని పని చేస్తూ వస్తున్నారు.

తమ్ముడు చెల్లి! నీ కుటుంబంలో ఎవరైనా ఇలాంటి పాప జీవితంలో జీవిస్తూ ఉన్నారంటే వాళ్ళ కొరకు యేసయ్య దగ్గర తరచుగా ప్రార్ధించినయెడల వాళ్లనుకుడా యేసయ్య మార్చుటకు సిద్ధంగా ఉన్నారు. ప్రార్ధిస్తావా? ఓకే!  శ్రీమతి. సారా సుభాష్.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)