దిన ధ్యానము(Telugu) 10.04.2021
దిన ధ్యానము(Telugu) 10.04.2021
కోపము మారవలెను.
"మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి" - రోమీయులకు 12: 2
వెస్టిండీస్ దీవిలో షిమ్యోన్ ప్లాస్టర్ అనే కోపిష్టి మనిషి ఉండే వారు. యేసుక్రీస్తు ఈయన జీవితంలోనికి వచ్చేసరికి ఈయన కోపం అంతా కూడా కనుమారుగైపోయింది. ఆయన హృదయంలో ఆత్మల యెడల భారము, దేవుని మీద ప్రేమ పొంగి పొర్లింది కాబట్టి అతను చిన్న చిన్న పరిచర్యలు చేస్తూ వచ్చారు. ఇలాగు ఒక దినము పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక ఇంటి తలుపు తట్టారు. ఆ ఇంటిలో గల స్త్రీ శ్రీమతి అప్ డేట్ వచ్చి తలుపు తీశారు. ఆమె చేతిలో పాల పాత్ర ఉంది బయట నిలబడినది ఒక క్రైస్తవ వ్యక్తి అని తెలిసేసరికి ఆమెలో ఉన్న కోపము పోయింది. చేతుల్లో ఉన్న పాల పాత్రలో ఉన్న పాలు అన్ని కూడా షిమ్యోను మొఖం పై విసిరివేసింది. షిమ్యోను మొఖం మీద కారుతున్న పాలను తుడుసుకొని చిరు నవ్వు నవ్వసాగారు. మంచి పాలు మొఖం పైన పోయాడానికి బదులుగా కడుపులో పోసి ఉంటే బాగుండును అని అన్నారు. ఈ మాట విన్న ఆ స్త్రీ సిగ్గుతో తల వంచుకున్నారు. వెంటనే ఆమె ఆయనను లోపలికి పిలిచి త్రాగుటకు మంచి పాలు ఇచ్చింది. యేసయ్య గురించి తెలుసుకుంది. షిమ్యోను యొక్క సాత్వికమైన గుణము ఆ స్త్రీని యేసయ్య లోనికి నడిపించింది.
నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మోషే తన హెబ్రీ సహోదరుని ఒక ఐగుప్తీయుడు కొట్టుట చూసి అటు ఇటు చూసి ఎవ్వరు లేనందున ఆ ఐగుప్తీయుడను కొట్టి చంపి అతనిని ఇసుకలో పూడ్చి వేసెను. మోషే మనుష్యుని చంప గలిగినంత కోపిష్టిగా ఉండే వాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ముండ్ల పొదలలో దేవుడు మోషేను దర్శించారు. దాని తరువాత ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు లో నుండి కానానుకు నడిపిస్తున్నప్పుడు మోషేకు విరుద్ధంగా ప్రజలు సణుగుకొంటున్నారు. మోషేను రాళ్ళు రువ్వి చంపుటకు ప్రయత్నం చేస్తున్నారు. అయినను మోషే వాళ్ళ మీద కోపగించుకోకుండా వాటన్నింటిని దేవుని యొద్ద చెబుతున్న దానిని చూస్తున్నాం. భూమి మీద అందరికంటే మోషే మిక్కిలి సాత్వికుడు అని దేవుడు మోషే కొరకు సాక్ష్యం చెబుతున్న దానిని చూస్తున్నాం. ఒక క్రైస్తవుని యొక్క ఉన్నత గుణ లక్షణము వాడి వ్యక్తిగత క్రమశిక్షణ. అది దేవుని పిల్లలుగా పిలవబడుతున్న అందరికి వుండవలసినది.
క్రీస్తు నందు ప్రియమైన వారలారా! మీరు కోపపడి దేనిని సాదించలేరు. మీరు రక్షించ బడకమునుపు మీరు కోపిష్టిగా ఉండి ఉండవచ్చు. ఇప్పుడు అయితే రాతి గుండె మాంసపు గుండెగా మారకుండా అన్నింటికి కోప పడుతున్నామా? మనలను మనమే నిదానించి చూసుకుందాం. యేసుక్రీస్తు ప్రేమ, ఆయన స్వభావము మన హృదయంలో ఉండినప్పుడు మోషే వలె ఎలాంటి సమస్యలు మన మీదకు వచ్చినప్పుడు ఇతరుల మీద కోప పడకుండా వాటిని దేవుని యొద్ద పెట్టే వ్యక్తిగా మనము మారుతాం. దేవుడు మనలను గురించి కచ్చితంగా సాక్ష్యం ఇస్తారు.
- బ్రదర్. పి. శివ
ప్రార్థన అంశం:-
గెత్సేమనే క్యాంపలో జరుగుతున్న ప్రార్థన గుడారపు కట్టడ పనులు త్వరగా పూర్తి చేయబడేటట్లు, దానికి అవరమైన సహాయం అందబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250