Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 09.04.2021

దిన ధ్యానము(Telugu) 09.04.2021

మరువని దేవుడు.

"...నేను నిన్ను మరచిపోజాలను" - యెషయా 44:21

ఆ దినము ద్విచక్ర వాహనంలో రామ్నార్డ్    జిల్లాకు పరిచర్యకు వెళ్ళియున్నారు నా భర్త. పరిచర్య ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఒక పెద్ద ప్రమాదం. తలకు పెట్టుకున్న హెల్మెంట్ ఎగిరిపడింది.తలకు పెద్ద దెబ్బతగిలి ముక్కునుండి, నోటినుండి రక్తం కారడం ప్రారంభించింది. వెంటనే మధురై హాస్పిటల్ కు తీసుకు వెళ్ల వలసిన పరిస్థితి. ప్రమాదం జరిగిన స్థలమైన సాయిల్ గూడి నుండి మదురై 3 1/2 గంటలు ప్రయాణం. అంబులెన్సు త్వరగా వెళ్తుంది. అతనికి ఏమాత్రం స్పృహా లేదు. అప్పుడే నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ విన్న వెంటనే ఒక్క క్షణం ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే మోకరించాను ప్రభువు నేను మరువలేదు అనే వాక్యాన్ని చెప్పి నన్ను బలపరిచారు. 

రాత్రి 7 గంటలకు డాక్టర్ వచ్చి సారి తలలో పెద్ద గాయం తగిలింది అందుకొరకు ఒక పెద్ద ఆపరేషన్ చెయ్యాలి. ప్రాణమునకు గ్యారంటీ లేదు కాని మేము ప్రయత్నం చేస్తాము. ఒక వేళ ఆపరేషన్ సక్సెస్ అయిన గాని చేతులు, కాళ్ళు పని చేయలేకపోవచ్చు. జ్ఞాపక శక్తి కూడా వుండక పోవచ్చు లేదా కోమ స్టేజికి వెళ్ల వచ్చు అని అన్నారు. ఆమాట వినగానే సేవకులు అందరూ కూడా కొన్ని గంటల్లో దిగ్భ్రాంతి చెంది ఉండిపోయారు. ఇంచు మించు 5 గంటల సేపు ఆపరేషన్ జరిగింది. అనేక గంటలు తరువాత కళ్ళు తెరిచారు నా భర్త. నేను భయపడుతూ లోపలికి వెళ్ళాను నా పేరుపెట్టి పిలిచి నాకు ఏమి జరిగింది అని అడిగారు హల్లెలుయా!. అతని కాళ్ళు, చేతులు పనిచేతుస్తున్నాయి. ఈ దినము వరకు 6 సంవత్సరాలుగా ఆ పరిచర్యను నూతన బలముతో చేస్తున్నారు. 

అవును ప్రభువు ఇచ్చిన మాట నిన్ను నేను మారువలేదు అన్నదే నా నిరీక్షణకు కారణముగా ఉండేది. మరువలేదు అంటే నా గురించి తలంచుచు ఉంటారు అన్నదే అర్ధం. సర్వ లోకానికి ప్రభువు అయిన ఆయన దృష్టిలో మనము ఉన్నంత వరకు ఆయన మన చెయ్యి ఎలా విడువ గలరు. ఆయన చేతిలో మనము ఉన్నంత వరకు మనకు కీడు చేయుట ఎవరి వలన కాదు. అవును ఈ ప్రపంచంలో ఎవరైనా మనలను మరువవచ్చు కాని ప్రభువు అయితే  మనలను మరువరు. 

ప్రియమైన సహోదరుడా, సహోదరి! మీ జీవితంలో కన్నీటిని ఆనందముగా మార్చడానికి ప్రభువు మీ జీవితంలో కూడా అద్భుతం చేస్తారు. ఒకవేళ మీరు దుఃఖంలో కూరుకుపోయి, వేదనతో ఉండి ప్రభువు నన్ను మర్చిపోయారు అని నిరుత్సాహంతో వుంటున్నారు కలత చెందకండి ఆయన మిమ్మల్ని మరచిపోలేదు. ఆయన మీ దుఃఖం, మీ కన్నీరును చూస్తున్న దేవుడు కచ్చితంగా అద్భుతం చేస్తారు. ఆయన ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తున్నారు అనే దానిని మర్చిపోకండి. ఆయన ఎన్నడూ మిమ్మల్ని చేయి విడువడు. 
-    శ్రీమతి. జ్యోతి ఆనంద్

ప్రార్థన అంశం:-
40 దినములు జరుగుతున్న క్యాంప్ యొక్క ధన సహాయము తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)