దిన ధ్యానము(Telugu) 08.04.2021
దిన ధ్యానము(Telugu) 08.04.2021
నిన్ను కాపాడుకొనుము:-
"తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించెదనని ఆయన నాతో చెప్పిన దినమునుగూర్చి వారికి తెలుపుము" - ద్వితియోపదేశకాండము 4: 10
పరిణామ ఎదుగుదల వలన మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి చార్లెస్ డార్విన్. ఆయన తన మరణ పడకమీద ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న సంఘం పాటలు పడుతున్నప్పుడు వాటిని వినడానికి తన గది యొక్క కిటికి తెరవమని చెప్పారంట. ఆయన పక్కనే ఉన్న వాళ్ళు ఆయనను చూసి డార్విన్ అలాగైతే పరిణామము గురించి మీ సిద్ధాంతములు సంగతి ఏంటి అని ఆడిగారంట. అందుకు డార్విన్ అది నా యవ్వన ప్రాయంలో అది నా కల్పనా కధ అని సమాధానం ఇచ్చారు. 22వ సంవత్సరంలో థియోలజీ చదువును పూర్తి చేసుకొన్న డార్విన్ దేవుని గురించి తెలుసుకోకుండా, సంఘంలో చేరకుండ మనుష్యుని యొక్క సృష్టి గురించి తప్పుడు సిద్ధాంతం లోకానికి ప్రకటించారు. డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతం విశ్వసించిన లోకమంతా ఆయన యొక్క చివరి కాల మాటలను మరుగు చేసింది.
లోక జ్ఞానం, విజ్ఞానం పెరిగిపోయిన ఈ రోజుల్లో దేవుని విడిచి దారి మళ్లించే పరిస్థితులు అనేకము కనబడుతున్నప్పటికి దేవున్ని ఆయన రక్షణను పొగొట్టుకోకుండా, విశ్వాసంలో దిగజారిపోకుండా, సందేహించ కుండ ఉండుటకు దృఢమైన మనస్తత్వం మన యవ్వన సంతతి వాళ్లకు అవసరం. దానికి దేవుని బలాన్ని, ఆయన నడిపింపును మన తరువాత వస్తున్న సంతతి వాళ్లకు మరువకుండ నేర్పించాలి. యూదులు దేవుని గురించి పసి ప్రాయం నుండే తమ పిల్లలకు ఆజ్ఞలు నేర్పిస్తుండేవారు. మోషే తన తల్లి దగ్గర ఎదిగినప్పుడే దేవుని గురించి నేర్చుకున్నాడు. అదే తన జీవితంలో దేవుని కొరకు బలముగా నిలబడుటకు సహాయపడింది. పౌలు తిమోతి గురించి మాట్లాడుతున్నప్పుడు అతని తల్లి, అమ్మమ్మ కు ఉండిన దేవుని గురించిన విశ్వాసము నీకును ఉంటుంది అంటున్నారు. కారణం ఏమిటి ఆయన అమ్మమ్మ, అతని తల్లి చిన్నప్పుడు నుండే దేవుని గురించి సరైన బోధను బోధించేవారు.
మనము ఎలా ఉంటున్నాము? మన పిల్లల యొక్క కార్యములలో చదువు, లోక జ్ఞానం తెలివితేటలు వీటన్నింటికి ఇస్తున్న ప్రాధాన్యత కంటే దేవుని కొరకు ప్రాధాన్యత ఇస్తున్నమా? దేవుని గురించి సరైన జ్ఞానం మన యెద్ద ఉన్నదా? మనము తెలివిగ బుద్ది కలిగి ఉంటేనే మన సంతతి వాళ్ళను ఈ లోకపు మాయలో చిక్కకుండ దారితప్పిపోకుండా కాపాడి దేవుని యొద్దకు నడిపించగలం. మన తరువాత సంతతి వాళ్ళ కొరకు దేవుని యొద్ద మనమే ఉత్తరవాదులం అనే దాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు.
- శ్రీమతి. వసంతి రాజమోహన్.
ప్రార్థన అంశం:-
క్యాంప్ లో పాల్గొనబోతున్న సేవకులను చివరి కాల ఉజ్జీవపు అపోస్తులుగా మారేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250