Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 26.02.2024

దిన ధ్యానము(Telugu) 26.02.2024

 

అంశం:- త్వరగా వస్తాను

 

"ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్‌; ప్రభువైన యేసూ, రమ్ము" - ప్రకటన గ్రంథం 22:20 

 

దేవుని యందు భయభక్తులు గల ఒక వైద్యుడు చాలా నైపుణ్యత గలవాడిగా జీవిస్తూ వచ్చాడు. ఆయన భార్య సమస్త కార్యాలకు తన భర్త అయినా ఆ వైద్యుడు మీద ఆధారపడి ఉండేది. హఠాత్తుగా వైద్యుడు ఒకరోజు మరణించడం చేత ఆయన భార్య భర్త లేకుండా చాలా ఇబ్బంది పడతారు అని అందరూ ఎదురుచూసేవారు కానీ ఆమె అయితే కొన్ని దినాలలోనే కోలుకొని తనను బలపరుచుకున్నారు. కారణము ఆ వైద్యుడు తన డైరీలో రాసిన చివరి మాటలే. అది ఏమిటి అంటే బయటికి వెళ్లి ఉన్నాను త్వరగా వచ్చేస్తాను అన్న మాటలు. ఆయన రాసిన ఆ మాటలు ఆమె హృదయంలో నిండుగా ఉండుట చేత ఆ మాటలు ఆదరణను బలాన్ని ప్రభువు నుండి తనకు ఇచ్చాయి. ఆ దినము నుండి అ వైద్యుడు యొక్క భార్యకు ఈ లోకపు జీవితం కొరకు యేసయ్యను అనుకుంటాను, ఈ లోకము ముగింపు కాదు ఇది ఒక అద్దె ఇల్లు యేసయ్యను ఆయనతో కూడా నా భర్తను కలుసుకుంటాను నా విశ్వాసంలో బలపడి నా జీవితంలో ముందుకు వెళ్తాను అని నిర్ణయించుకున్నారు. 

 

యేసుక్రీస్తు యొక్క చివరి భోజనపు బల్లలో ఈ గిన్నె నా రక్తం వలనైన కొత్త నిబంధన అని చెప్పారు. మీరు దీనిని త్రాగునప్పుడల్లా నన్ను గుర్తు చేసుకొనుటకు దీన్ని చేయండి అని చెప్పారు. ప్రభు రాత్రి బల్ల ఆయన యొక్క రెండవ రాకడను గుర్తు చేసుకున్నట్లుగా ఆయన రాకడను ఆసక్తితో ఎదురుచూస్తూ ఉండాలి అనేదానికి గుర్తుగా మనకు ఉన్నది. 

 

ప్రియమైన వారలారా! ప్రభువైన యేసుక్రీస్తు ఎలా మన పాపము కొరకు సిలువలో కొట్టబడి, మరణించి తిరిగి మూడవరోజు లేచారో అలాగే ఆయన రెండవ రాకడలో కూడా ప్రాముఖ్యమైనది ఒకటి ఉన్నది అది అయన ఎప్పుడు వస్తారో తండ్రి తప్ప వేరే ఎవరు ఎరుగరు కాబట్టి మనము అయన రాకడ కొరకు ఆసక్తితో ఎదురుచూస్తూ ఉందాం. అంతవరకు మన యొక్క సమస్త కార్యముల కొరకు ఆయన పైనే అనుకోని ఉందాం. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తు నందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము (1 కోరింది 15 :19) అని బైబిల్ మనల్ని హెచ్చరిస్తుంది. ఆయన రాకడ కొరకు ఎదురుచూస్తూ ఉంటున్న మనము ఇతరులకు కూడా దాని కొరకు సిద్ధపరిచి రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. ఎందుకంటే ఆయన రెండవ రాకడ చాలా సమీపముగా ఉన్నది. 

- శ్రీమతి. బ్యూలా గారు 

 

ప్రార్థన అంశం:-

డే కేర్ సెంటర్ ద్వారా మనము దర్శించే ఆంధ్ర, ఒడిస్సాలో గల చిన్నారుల గురించి ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)