దిన ధ్యానము(Telugu) 07.04.2021
దిన ధ్యానము(Telugu) 07.04.2021
గొప్ప ప్రమాదం:-
"ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పర చెదవు" - కీర్తనలు 50:15
గడిచిన సంవత్సరంలో గొప్ప ప్రమాదకరమైన రోగము కరోనా ప్రపంచములో గల అన్ని దేశాల్లో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టిన దానిని మనం చూసాము. ఎక్కడ చూసినా మరణ భయం. కరోనా ప్రమాదం రాకుండా అనేక దేశాల్లో అనేక మంది ప్రభువు యొద్ద ప్రార్దించిన దానిని చూస్తున్నాం. ఎప్పుడు ఒక మనిషికి శరీర ప్రకారమైన కఠినమైన వ్యాధి, ప్రమాదాలు, వ్యాపారములు, సునామీ, భూకంపాలు, లోకానుసారమైన అప్పులు అనేక శ్రమలు వచ్చినప్పుడు దేవుని వైపు చూచి ప్రార్ధించుట అలవాటు. కాని వీటన్నింటి కంటే గొప్ప ప్రమాదం పొంచి ఉంది. అదేమిటి అంటే పాపము. దీనిని తప్పించుకొనుట ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పాపమే ఈ లోకములో పరిశుద్ధముగా జీవించుటకు మరణము తరువాత నిత్య పరలోకమునకు జీవితమునకు చేరుటకు ఆటంకంగా ఉంటున్న గొప్ప ప్రమాదం. ఈ ప్రమాదంలో నుండి తప్పించుకోవడానికి మొట్టమొదట ప్రభువు సహాయం మనము అడగాలి.
దావీదు ఈ లోకములో శత్రువుల చేత అనేక విధములైన ఆటంకాల మధ్యలో వుంటున్నప్పుడు ప్రభువు వైపు చూసి ప్రార్థిస్తున్నాడు. కాని బెర్షెబా తో పాపము చేసినప్పుడు ఆ ఆపదను గ్రహించలేదు. అలాగే సమ్సోను గాడిద దవడ ఎముకతో వెయ్యిమందిని చంపి దప్పికతో చచ్చిపోతానేమో అని ప్రభువు వైపు చూసి ప్రార్ధించాడు. అలాగే కనులు పెరికివేయబడిన తరువాత ఫిలిష్తీయుల చేతిలో చచ్చి పోతానేమో అని ప్రభువు వైపు చూచి ప్రార్థిస్తున్నాడు. కాని వ్యభిచార స్త్రీ నిమిత్తముగా పాపము వచ్చినప్పుడు ఆ పాపము నిమిత్తము విడిపించబడాలి అని ఎంత మాత్రం ప్రభువు యొద్ద ప్రార్ధించ లేదు.
ఈ దినము లోకంలో సోషల్ మీడియా ద్వారా వాట్సాప్, యూట్యూబ్, ఫేస్ బుక్, ఆన్లైన్ గేమ్, చెడు స్నేహితులు అని పాపము మనలను లాగేస్తుంది. ఇలాంటి గొప్ప ప్రమాద కరమైన పాపము దగ్గరకు లాగినప్పుడు మనలో ఎంత మంది పాపములో నుండి మనలను కాపాడుకొనుటకు ప్రభువు వైపు చూచి సహాయము అడుగుతున్నాం. ఇలాంటి పాపములో పడినప్పుడు అనేకమంది ఆత్మహత్య చేసుకొంటున్నారు. బైబిల్ వాక్యం చెబుతుంది యోబు 1:15లో దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వం చెంది మరణమును కనును. యాకోబు 1:15లో పాపము వలన వచ్చే ప్రమాదమును యేసుక్రీస్తు సహాయముతో జయిద్దాం. ఆయన కచ్చితంగా మనలను విడిపిస్తారు.
- బ్రదర్. పి.వి. విలియమ్స్.
ప్రార్థన అంశం:-
దేశాన్ని సొంతం చేసుకొనే తర్ఫీదు క్యాంప్ లో నేర్పించుటకు వస్తున్న దేవుని దాసులు దేవుడు బలముగా వాడుకొనేటట్లు ప్రార్దిద్ధాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250