Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 06.04.2021

దిన ధ్యానము(Telugu) 06.04.2021

మెలకువగా ఉండి ప్రార్ధించండి.

"రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను" - 1తిమోతికి 2: 2

గ్రామంలో గల ఒక ఇంట్లో పోరాట పక్షులు కొన్నింటిని పెంచుతూ వచ్చారు. హఠాత్తుగా ఒక దినము రాత్రి వ్యత్యాసమైన స్వరము రావడం వలన వాటిని చూచుటకు ఆ ఇంటి అతను ఆ గూటి యొక్క తలుపులు తీసేసరికి అవి ఎగురు కొంటూ వచ్చి బయటకు వెళ్లి బిగ్గరగా అరవడం ప్రారంభించింది. ఏమిటి అని లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఇంటి నీళ్ల గొట్టం ద్వారా పాము ఒకటి లోపలికి వచ్చింది. ఆ వార్తను ఆ ఇంటి వారికి తెలిపి వాళ్ళను కాపాడుటకు అవి గొప్ప శబ్దం చేసి శత్రువు వలన అపాయం కలుగకుండా ఆ ఇంటి వాళ్ళను కాపాడింది. 

ఆ కాలములో ఇజ్రాయేలు ప్రజలను ఏలుటకు రాజులు లేరు దేవుడే వాళ్ళను నడిపించారు. తరువాత న్యాయదిపతులను, ప్రవక్తలు ద్వారా దేవుడే వాళ్ళను పరిపాలించారు. అయినప్పటికీ ఇశ్రాయేలీయులు ఇతరుల దేశములు వలె వాళ్ళను పరిపాలించుటకు వాళ్ళ యొక్క ఇష్టానికి దేవుడు అప్పగించి సౌలును రాజుగా నియమించారు. అది ఆయన దృష్ఠికి బాధగా ఉండేది. తరువాత సౌలును త్రోసివేసి దావీదును రాజుగా చేశారు. దావీదు దేవుని దృష్టిలో మంచిగా జీవించి దేవుని హృదయనుసరమైన వ్యక్తిగా పిలువబడ్డాడు. తరువాత వచ్చిన వాళ్ళు  విడిచి దారి తప్పిపోయినందున దేశము బానిసత్వము లోనికి వెళ్ళింది. 

మన దేశంలో ప్రశాంతంగా జీవించుటకు పరిపాలించే వారు అనగా అధికారుల కొరకు పరిపాలించుట మన బాధ్యత. ఈ దిన కాలములో దేవుని పరిపాలన మన దేశంలో కనబడేటట్లు ఆయన చిత్తనుసారమైన వ్యక్తులు పరిపాలనలోనికి వచ్చేటట్లు మనం ప్రార్ధించ వలసినదై యున్నది. నీతితోను, నిజాయితీతోను దేవునికి భయపడుతున్న భయముతోను దేశాన్ని పరిపాలించే నాయకులు లేపబడాలి. ధనము కొరకు, పదవి కొరకు, ప్రఖ్యాతి కొరకు ఆశపడకుండ ప్రజల మేలు కొరకు తెలివిగా ప్రజలను పరిపాలించే నాయకుల కొరకు మనము ప్రార్ధనా చేయాలి. ఇలాగు పోరాడే పక్షి ఎగిరి శత్రువు ఇంటిలో దూరకుండా శబ్దం చేసి తన యజమానుని కుటుంబాన్ని కాపాడుకుందో అలాగే క్రైస్తవులమైన మనము మన దేశంలో శ్రద్ధ కలిగిన వారంగా దేవుని చిత్తం లో ఉన్నవారు మాత్రమే అధిలోనికి వచ్చుటకు  శ్రద్ధ కలిగిన వారంగా ప్రార్థిద్దాం. అన్నింటి కి పైగా దేవుని రాజ్యాంగంగాచేస్తున్నారు. ఆయన చేయి దాటి ఏమి జరగదు. కాబట్టి బెదరకుండా, తడబడకుండా ప్రార్డనతో మన యొక్క ఓటును వినియోగించుకుందాం. 
-    సహోదరుడు.హానిస్ సామవేల్

ప్రార్దనా అంశం:-
దేశాన్ని స్వతంతరిస్తాం  తర్ఫీదు క్యాంపు లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు అవకాశంగా వాడబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)