దిన ధ్యానము(Telugu) 04.04.2021 (Kids Special)
దిన ధ్యానము(Telugu) 04.04.2021 (Kids Special)
ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసం:-
జయసీలుడు:-
"విజయమందు మరణము మింగివేయబడెను" - 1 కొరింథీయులకు 15:54
కూ.... కూ... చికుబుకు.... చికుబుకు అని శబ్దం విన్నవెంటనే ట్రైన్ చూడాలని ఆశ వస్తుంది కదూ! ట్రైన్ లో ఊరికి వెళ్లాలంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా! ఇలా ట్రైన్ వెళ్ళుట వచ్చుట చూస్తూ ఆనందిస్తూ ఉన్నాడు ఒక గొఱ్ఱెల కాపరియైన తమ్ముడు. ట్రైన్ నడిపే డ్రైవర్ కూడా రోజు అతనిని చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఆయనని చూచిన ఈ గొర్రెల కాపరి రోజు చేయి ఊపుతూ టాటా చెప్తూ ఉండే వాడు. ఇది అతనికి చాలా సంతోషాన్నిచ్చింది. రోజు ఇలాగే తమ యొక్క ప్రేమను వ్యక్త పరుస్తూ ఉండేవారు. గొఱ్ఱెలు కాస్తూనే ట్రైన్ కొరకు వేచి యున్నాడు.ఒకదినము హఠాత్తుగా ఏర్పడిన వరదల వలన రైలు పట్టాలు కొట్టుకు పోయింది. ట్రైన్ పట్టాలు విరిగి పోయి ఉండుట చూచిన కాపరియైన బాలుడు అటూ ఇటూ పరిగెత్తాడు. ఏమి చేయాలో తోచట్లేదు. ట్రైన్‌ని ఎలాఐన ఆపాలి అని ట్రైన్‌కి ఎదురుగా పరిగెత్తడం ప్రారంభించాడు. ట్రైన్ శబ్దం వినిన వెంటనే ఇంకా వేగంగా ట్రైన్ కి ఎదురుగా పరిగెత్తడం ప్రారంభించాడు. రెండు చేతులు కదిలిస్తూ వస్తున్నాడు ఆ డ్రైవర్ కి ఏమి అర్ధం కాలేదు. ఏంటి ఎప్పుడు బయట ఉండేకదా టాటా చెప్తూ ఉంటాడు పట్టాలపై నిలబడి చెప్తున్నాడేంటి అని తలంచి ట్రైన్ ని ఆపాలని ప్రయత్నించారు కాని కుదరలేదు కొంతదూరం వెళ్లి ఆబాలుని గుద్దేసి నిలబడింది. ఆ బాలుని యొక్క శరీరము పట్టాలమీద చెల్లాచెదురుగా పడివుంది. ఎందుకు ఈ బాలుడు మరణించాడు అని ఎవరికి అర్ధం కాలేదు కొంత దూరం నడచి వెళ్లి చూస్తే ఆ రైలు పట్టాలు వర్షానికి కొట్టుకు పోయి ఉండుట చూచి అందరి హృదయము బద్దలైపోయింది. ట్రైన్ లో ప్రయాణిస్తున్న వారందరిని కాపాడుటకు ఆ బాలుడు చేసిన త్యాగాన్ని తలంచినప్పుడు అందరి కళ్ళల్లో కన్నీరు కారడం ప్రారంభ మయ్యింది.
ఈ లోకంలో ప్రయాణిస్తున్న మన యొక్క ప్రయాణం కూడా సుఖవంతంగా ఉండాలని యేసు సిలువ వేయబడ్డారు. మన పాపాల కొఱకు రక్తం కార్చి మరణించారు. అయినప్పటికీ ఒక సంతోషకరమైన వార్త యేసు మరల తిరిగి లేచాడు ఆయన సమాధి ఈ దినం వరకు తెరచే ఉంది. ఒక స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణము ఇవ్వొచ్చు కాని తిరిగి లేవలేడు కాని ఒకరు మాత్రమే లేచారు మరణాన్ని జయించారు.
ప్రియమైన తమ్ముడు , చెల్లి! యేసుక్రీస్తు లేచిన ఈ దినాన్నే ఈస్టర్ పండుగగా కొనియాడుతున్నాం. మరణము,పాతాళము అన్నింటిని యేసుక్రీస్తు జయించారు. నీవు విజవంతమైన క్రీస్తుని పట్టుకొనుము, విజయవంతమైన జీవితం జీవించుటకు యేసు నీకు సహాయం చేస్తారు హల్లేలూయ!.
- శ్రీమతి. షీభా విజయ్
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250