Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 03.04.2021

దిన ధ్యానము(Telugu) 03.04.2021

మూడే మాటలు.

"మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను.” - ప్రకటన గ్రంథం 1:18

1943వ సంవత్సరం రష్యా దేశానికి సర్వధికారియైన హిట్లర్ ముట్టడించి రష్యా దేశంలో ఎక్కువ భాగమును తన ఆధీనంలో తీసుకున్నారు. రష్యా ప్రభుత్వం హిట్లర్ సైన్యమును ఎదిరించలేక ఇబ్బందిపడింది. అదేసమయంలో ఈస్టర్ వచ్చింది. కమ్యూనిస్ట్ దేశమైన రష్యా అప్పటికి అనేక ఆలయములను మూసిఉంచి ఒకే దేవాలయము తెరవబడి ఉంది. దాంట్లో ప్రజలు వచ్చి పాల్గొన్నారు. బోధకుడు వచ్చి ఉత్సాహంగా  ప్రసంగం  చేయడం ప్రారంభించారు. అతని సంతోషం విశ్వాసులు మధ్యలో వరదవలె పొంగిపొర్లింది. కాని మరుసటి రోజు ఉదయమున  అతను బందించబడ్డాడు. ఆయన తీసుకు వెల్లబడకమునుపు మాట్లాడ వచ్చు అని అనుమతించారు. కాని మూడు మాటలు మాత్రమే అని అధికారికంగా చెప్పారు. అతను మాట్లాడిన మూడు మాటలు ఏమిటో తెలుసా యేసు సజీవుడు హల్లేలూయా అని చెప్పి ముగించిన వెంటనే ప్రజలు అందరు అదే మాటలు చెప్పడం ప్రారంభించారు. వాళ్ళ యొక్క విశ్వాసము బలపడింది. 

యేసు క్రీస్తు ఈ లోకమునకు మనిషిగా వచ్చి 33 1/2 సంవత్సరాలు జీవించారు. దాంట్లో 3 1/2 సంవత్సరాలు మాత్రమే పరిచర్యచేసి మన పాపముల కొరకు సిలువలో వేయబడి మరణించారు. ఆయనతో ఉండిన శిష్యులు యేసు మరణించారు ఇక మనము ఏమి చేస్తాము అని భయపడిపోయారు. యేసు వలె మనలను కూడా చంపేస్తారేమో అని ఒక గదిలో దాక్కొన్నారు. యేసు మరణించి మూడవ దినమున లేచి భయపడకుము అని చెప్పారు. తరువాత 40 దినములు సజీవుడుగా తనను అనేకులకు ప్రత్యేక్ష పరిచారు. పరమునకు వెళ్ళక ముందు భూదిగంతముల వరకు నేను మీకు తోడుగా వున్నాను అని చెప్పి యేసుక్రీస్తు సజీవుడుగా మనలో నివాసం చేస్తున్నారు. 

ప్రియమైన వారలారా! మీ యొక్క జీవితంలో కూడా ఉన్న సమస్యలను చూచి చింతతో భయపడుతున్నారా? అందరి వలన చేయి విడువబడి ఇక ఎవరు నాకు సహాయము చేయగలరు అని  నిరుత్సాహపడుతున్నారా?  నిరుత్సాహపడకండి ఆయన మీ జీవితంలో ఒక నూతన ప్రారంభమును చేయగలడు. కారణము ఆయన సజీవుడై యున్నారు. సజీవుడైన యేసయ్య కు మీ జీవితంలో సమస్యలు అన్నీ చెప్పి విమోచన పొందండి. యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించి మిమల్ని హెచ్చిస్తారు.
-    బ్రదర్. పి.శివా

ప్రార్థన అంశం:-
సంపూర్ణ మిషనరీల యొక్క ఆరోగ్యం కొరకు, దేవుని సంరక్షణ కొరకు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)