Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 02.04.2021

దిన ధ్యానము(Telugu) 02.04.2021

విజయ చిహ్నం.

"...మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును" - గలతియులకు 6: 14

క్రి.శ 312 లో రోమా సామ్రాజ్యపు రాజు కన్స్ టెంటైన్ అనే అతనికి విరోధముగా మాక్స్అనిడియస్ అనే రాజు యుద్ధానికి వచ్చాడు. ఆ సమయంలో మిక్కిలి కలతతో ఉండిన కన్స్ టెంటైన్ తన స్వప్నమందు వెలుగుగల సిలువ ఒకటి దాని పక్కనే ఈ గుర్తు వలన నీవు విజయమును పొందుదువు అనే స్వప్నము చూసి మిక్కిలి సంతోషంతో నిద్రనుండి లేచాడు. ఆ రాత్రిలోనే తన సైనికులు అందరిని తమ ఖడ్గము పైన సిలువ గుర్తును రాసుకొని యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. చివరికి రోమా సైన్యము మాక్స్ సైనము పైన గొప్ప విజయమును పొందుకున్నరు. సిలువ గుర్తు ద్వారానే విజయమును పొందుకున్న కన్స్ టెంటైన్ ఆ దినము మొదలుకొని క్రీస్తుని వెంబడించినట్లు చరిత్ర చెబుతోంది. అతనితో కూడా అనేక మంది దేవున్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తుని వెంబడించారు.

ఈ దినము యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము లోకమంతటిలో ఉన్న సంఘమునకు గుర్తు చేస్తుంది. శాపమునకు చిహ్నమైన సిలువలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచుట వలన అది విజయపు చిహ్నంగా మారింది. అపోస్తులుడైన పౌలు గలతి సంఘమునకు రాస్తున్నప్పుడు నేను మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గూర్చి తప్ప మరి దేని గురించి అతిశయపడను అని చెబుతున్నారు. అవును మనము అతిశయించ వలసిన చిహ్నం సిలువ. సిలువ నీడే మనము ఆదరణ పొందుకున్న స్థలము కాని ఒక మ్యాజిక్ చిహ్నం కాదు సిలువ. దానిని ఉన్నతంగా, మహిమగ సిలువ మరణము ద్వారా మోక్షం దయచేసిన యేసయ్య వలనే అది విజయపు చిహ్నం.

దీనిని చదువుతున్న మీరు ప్రతి రోజు మీ యొక్క సిలువను మోస్తూ క్రీస్తును వెంబడిస్తున్నారా? సిలువ ఉపదేశమునకు లోబడి దేవుని బలాన్ని పొందుతున్నారా అలాగైతే మీ యొక్క విజయము పరమందు మాత్రమే కాదు ఇహమందు కూడా విజయవంతగా ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని నిరుత్సాహాలు, కలతలు, బయములు రావచ్చు కాని మన రక్షకుడు సిలువలో మన పాపము కొరకు, శాపము కొరకు విజయము పొందిన దానిని గుర్తుంచుకొని మనం ధైర్యము పొందుకోగలము. సిలువలో సాతాను తలను నలగగొట్టి మనకు సంపాదించిన ఇచ్చిన విజయమును మన సొంతం చేసుకొని విజయవంతంగా జీవిద్దాం.
-    శ్రీమతి. జబా డేవిడ్ గణేషన్

ప్రార్థన అంశం:-
నూతనముగా కలిసిన మిషనరీలను దేవుడు బలముగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)