Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 01.04.2021

దిన ధ్యానము(Telugu) 01.04.2021

తగిన ఉపవాసమా?

"వాటిని మానక వీటిని చేయవలసియుండెను" - మత్తయి 23: 23

మనము ఇప్పుడు శ్రమదినముల చివరి రోజుల్లో ఉన్నాం. ఈ దినములను ఆత్మీయమైన ఋతు దినములు అని కూడా చెప్పవచ్చు. సంఘములో అనేక మైన ఆత్మీయ కూడికలు, అనేక మైన సందేశములు, శరీరాన్ని నాలగగొట్టబడే ఉపవసములు ఇవన్నీ అవసరమైనవే అదే సమయంలో ఒక కార్యాన్ని ఆలోచిద్దాం. ఈ దినాల్లో దేవునికి మీకు మధ్య ఉన్న బంధం బలపడి ఉందా? అనేక సమయాల్లో మనము బాహ్యమైన పరంపర్యా ఆచారములకు, బాహ్యమైన శుద్ధి కరణకు ఎక్కువ శ్రద్ధ చూపించి మన ఆత్మీయ జీవితమును వదిలేస్తున్నాం. మనం చేస్తున్న ఉపవసములు దేవునికి ఇష్టమైనదిగాను, వాక్యానుసారంగా ఉందా అని కింద అడుగుతున్న ప్రశ్నలు ద్వారా మనలను మనము నిదానించి చూచుటకు పిలవబడియున్నం.

1. మన జీవితంలో అక్రమ బంధకములు తెంపబడి ఉన్నాయా? అనగా మన పాపపు అతిక్రమములు విడిచి మారుమనస్సు పొందియున్నమా? ఇతరుల యొక్క పాప భారాన్ని తగ్గించుటకు ప్రయాస పడుతున్నామా? (యెషయా 58:6)

2. ఏదో ఒక పాప కార్యములో బానిసగా చిక్కు కొనియున్న ఒక్కరి నైనా విడిపించుటకు ఈ 40 దినాలు ఉపయోగపడ్డాయ. (యెషయా 58:6)

3.  మనం ఎంత మందికి సహాయము చేయగలిగాము, రోగమువలన, వేదన వలన  ఇరుకులో ఉన్న వారి భారాన్ని తొలగించుటకు సహాయము చేసానా? (యెషయా58:6)

4. ఆకలి గల వారికి ఆహారము ఇచ్చానా? దిక్కులేని వారి యెడల కనికరం కలిగి సహాయం చేసానా? (యెషయా 58:7)

5. ఈస్టర్ పండుగ కొరకు మనము కొత్త బట్టలు తీసుకున్నాం మరి ఇతరులకు వస్త్రం ఇచ్చామా? (యెషయా 58: 7)

6. మన కుటుంబంలో తోబుట్టువుల కష్ట పడుతున్నప్పుడు, వాళ్లకు సహాయము అవసరమైనప్పుడు చూసి చూడనట్టుగా ఉండి పోయామా? (యెషయా 58:7)

7. మన ఉపవాసం మన అంతరంగం చూస్తున్న తండ్రిని సంతోష పెట్టేదిగా ఉందా లేదా మనుష్యులు మెచ్చుకొనేటట్లు వాళ్ళ కనుల ఎదుట ఉంటుందా? (మత్తయి 6:17) మనం ఆలోచించి చూద్దాం.

ప్రియమైన వారాలరా! మన ఉపవాసం అంత్యదినములు ఎలా ఉంటున్నాయి? మనం తృప్తి చెందుటకు ఉపవాసం చేస్తున్నమా లేక దేవునికి ఇష్టమైన ఉపవాసముగా ఉంటుందా? లేని యెడల ఈ దినమే మనస్సు మార్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థిద్దాం. ఆయనతో కూడా మన స్వార్థమును సిలువలో కొట్టబడుటకు అంగీకరిద్దాం. మనము ఆయనతో మరణించిన యెడల మనము ఆయనతో లేస్తాం. హల్లెలుయా!
-    శ్రీమతి. భువన ధన బాలన్

ప్రార్థన అంశం:-
ఈ నెల అంత జరగబోతున్న దేవుని పరిచర్యలో దేవుని బలము బయలుపడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)