దిన ధ్యానము(Telugu) 30.03.202
దిన ధ్యానము(Telugu) 30.03.202
పౌరుషము.
"తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను" - సంఖ్యాకాండము 25:11
ప్రఖ్యాతిగాంచిన సినీ గాయకుడు ఒకరు కళాశాలలో జరుగుతున్న కార్యక్రమానికి పిలవబడ్డారు. ఆయనను చూచిన ఆనందంలో కళాశాల విద్యార్థులు అనేకులు ఆయనతో మాట్లాడుటకు ప్రయత్నించారు. కాని ఆయన అయితే ఎవరితోనూ ఏది మాట్లాడుటకు ఇష్టపడలేదు. దాని గురించి ఆ విద్యార్థులు అతనిని అడిగినప్పుడు మీరందరూ నాతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నారు అని అర్థం అవుతుంది కాని అవసరంలేని మాటలను మాట్లాడి నా స్వరమును పాడు చేసుకోకుండా దానిని సినిమా రంగానికే అంకితం చేయాలి కాబట్టి మీతో ఎక్కువగా మాట్లాడి నా స్వరము యొక్క మధుర్యము కోల్పోకూడదు అని అన్నారంట. లోక ప్రఖ్యాతి కొరకు సినిమా పాటలు పాడుతున్న ఈయనకు ఎంత పౌరుషము చూడండి.
కాని బైబిల్లో ఫినెహాసు అనే యవ్వనస్తుడు భక్తి కలిగి పౌరుషము చూపించి ఇశ్రాయేలీయుల జనముల మీద దేవుని వలన ఏర్పడిన కీడును ఆపివేశాడు అని చదువుతున్నాం. అతని వలన ప్రజలు కాపాడబడ్డారు. ఈయన దేవుని చేత పొగడబడ్డ వ్యక్తిగా ఉన్నారు. ఆయన సంతతిలో నిత్యమైన యాజకుల పట్టం దేవుని చేత ఇవ్వబడింది ఇది ఎంత గొప్ప ఘనతో చూడండి. దేవుడు ఒక మనిషిని కొనియాడుట ఎంత గొప్ప కార్యం. మనుష్యుడు మనల్ని పొగిడితేనే సంతోషిస్తున్నాం కాని ఫీనెహాసు లో ఉన్న భక్తితో కూడిన పౌరుషమును చూచి దేవుడే పొగుడుతున్నారు.
ప్రియమైన వారాలరా! ఇప్పుడే మనం అలోచిద్దాం. మనము ఎలాంటి పౌరుషము గల వారిగా ఉంటున్నాం లోకానికా ? లేదా మహోన్నతుడైన దేవుని కొరకా? మొదట నేను దేవుని కొరకు చాలా భక్తి కలిగి ఉండే వాడిని ఇప్పుడైతే నాలో దేవుని కొరకు మంట లేకుండా ఉన్నాను అనవచ్చు. కలత చెందకండి మరల మీ ప్రార్ధనలోను , పరిశుద్ధ జీవితములోను పౌరుషము కలిగి జీవించ గలరు. దేవుని యొద్దనుండి ఫీనెహాసు వలె అంగీకరము పొందుకొనుట కచ్చితం. ప్రాయత్నిద్దాం, ముందుకు వెళదాం.
- బ్రదర్. ఎస్. మనోజ్ కుమార్
ప్రార్థన అంశం:-
మన మిష్నరి దంపతుల్లో గర్భఫలము లేని వారికి దేవుడు గర్భఫలము దయచేయులాగున ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250