దిన ధ్యానము(Telugu) 28.03.2021 (Kids Special)
దిన ధ్యానము(Telugu) 28.03.2021 (Kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం:-
సన్నని రాయి మాట్లాడుతుంది.
"…బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు" - 1కోరింథీయులకు 1:28
పిల్లలు సంతోషంగా ఉన్నారా? అందరూ ఎక్కడ చూస్తున్నారు కిందకు చూడండి నేనే సన్నని రాయి మాట్లాడుతున్నాను. అదేంటి రాయి మనతో మాట్లాడుతుందా? ఏంటి మాట్లాడబోతుంది? అని ఆలోచిస్తున్నారా? కొంత సమయం నేను చెప్పినది వినండి. నేను నది ఒడ్డున ఉంటాను. నది నీటిలో కొట్టబడుతూ అందముగా, గుండ్రముగా మారిపోయాను. నది ఒడ్డున పడి యుంటాను. అనేకులు నన్ను తొక్కుకుంటు వెళ్ళిపోతారు. మరికొంత మంది నన్ను శ్రద్ధగా గమనించి నదిలో విసిరి వేస్తారు. మరికొందరు నన్న తీసుకువెళ్లి పక్షులను , పండ్లను కొట్టుటకు వడిసెలో పెట్టి వాడుతుంటారు. ఇశ్రాయేలీయుల కాపరులు కూడా తమ చిక్కము సంచిలి నన్ను ఎప్పుడు పెట్టుకుంటారు. గొర్రెలను హాని కలిగించే మృగములను కొట్టుటకు నన్న వాడుతుంటారు. పిల్లలు రాయి మాట్లాడుతుంటే ఆశక్తిగా ఉంది కదూ. ఇంకా వినండి రాయి నువ్వు ఎందుకు మాట్లాడకుండా ఉండిపోతున్నావు మాట్లాడు. అప్పుడు రాయి ఒక దినము దావీదు అనే కాపరి వచ్చి నన్ను మరియు నా వంటి ఇంకా నాలుగు రాళ్లను తీసి ఆయన చిక్కము సంచిలో వేసుకున్నాడు. మేము దేనికి ప్రయోజనముగా ఉంటాము నది ఒడ్డున పడి ఉంటాము. ఇప్పుడు చిక్కములో వచ్చి ఉన్నాము. హఠాత్తుగా ఒక స్వరము విన్నము. భూమి కదిలే అంతగా రాక్షస నడక. దావీదును చూసి రా నీ మాంసమును పక్షులకు, మృగములకు ఇస్తాను అని గర్జించాడు. అప్పుడు మేము గ్రహించాము ఇది యుద్ధము అని. చిన్న వాడైన దావీదు ఏమి చేయబోతున్నాడు అని మేము ఆలోచిస్తూ చూస్తున్నాము. నేను ఖడ్గముతోను, ఈటెతోను కాదు ఇశ్రాయేలీయుల దేవుని నామము పేరట వస్తున్నాను అని చిక్కములో చెయ్యి పెట్టిన వెంటనే నా ఫ్రెండ్స్ నలుగురు తప్పించుకున్నారు నేను మాత్రము అతనికి దొరికిపోయాను. నన్ను తన వడిసెలో పెట్టి కొట్టేడు చూడండి నుదుటి మీద దెబ్బ నేను కురుకుపోయాను. ఆ దెబ్బకు ఆయన కింద పడ్డాడు. దావీదు ఇశ్రాయేలీయుల తరుపున వెళ్ళినందున ఇశ్రాయేలీయులు అందరూ సంతోషంగా ఉన్నారు. నాకు గర్వంగాను, సంతోషంగాను ఉన్నది. ఏ ఆయుధములు లేకుండా సాధారణ సన్నని రాయి అయిన నా ద్వారానే దేవుడు విజయము ఇచ్చాడు. ఇది కదా కాదు ఇది జరిగిన నిజ సంఘటన. బైబిల్లో 1 సమూయేలు 17వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది.
హాలో పిల్లలు మిమ్మల్ని కూడా మిగిలిన పిల్లలు వలె తెలివితేటలు లేవు, తలంతూలు లేవు, వాడికి ఏమి రాదు అని చెప్పవచ్చు, కాని నీవు సర్వశక్తి మంతుడైన దేవుని హస్తంలో నిన్ను నీవు సమర్పించుకొనిన యెడల దావీదు సన్నని రాయిని వాడుకున్నట్టుగా దేవుడు మీ తల్లిదండ్రులు, బంధువులు, అనేకులు నిన్ను చూసి సంతోషించే విధముగా నిన్ను వాడుకుంటారు. ఆయన చేతుల్లో మిమ్మల్ని సమర్పిస్తారా? చేస్తారు కదూ! వెరీ గుడ్.
- శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250