దిన ధ్యానము(Telugu) 27.03.2021
దిన ధ్యానము(Telugu) 27.03.2021
లెవనెత్తుము.
"…పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును" - ప్రసంగి 4:10
అమెరికాలో ఉన్న ఒక ప్లే గ్రౌండ్లో అంగవైకల్యం గల చిన్నారుల కొరకు అని జరిగిన పరుగు పందెంలో అమెరికా ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామా ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. చిన్నారులు పరిగెత్తడం ప్రారంభించారు. అందులో ఒక బాలుడు హఠాత్తుగా క్రింద పడిపోయాడు. దానిని చూసిన మిగిలిన చిన్నారులు అందరూకుడా తమ పరుగును ఆపివేసి కింద పడిపోయిన ఆ బాలుని యొక్క రెండు చేతులను పట్టుకొని పైకి లేపారు. తరువాత అందరూ కలిసి పరిగెత్తడం ప్రారంభించారు. దీనిని చూసిన అమెరికా రాష్ట్రపతి అయిన బరాక్ ఒబామా తన కుర్చీలోనుంచి లేచి చప్పట్లు కొట్టి వాళ్ళను ఘనపరిచారు. దానిని చూసిన ఆ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ఆ చిన్నారులను ఘనపరచడం ప్రారంభించారు.
పరిశుద్ధమైన బైబిల్లో విశ్వాసంలో బలహీనమైన వాళ్ళను చేర్చుకోవాలి అని చదువుతున్నాం. మనకు బలము ఉండవచ్చు, కాని బలహీనుల యొక్క బలహీనతను మనము భరించాలి అని బైబిల్ చెబుతున్న దానిని మనము గుర్తు పెట్టుకోవాలి. అపోస్తులుడైన పౌలు రోమా పట్టణంలో గల సంఘస్తులకు వ్రాస్తున్న పత్రికలో 14, 15 వ అధ్యాయంలో క్రింద పడిన వాళ్ళను లేపవలెను అని చెబుతున్నారు. లుకా 14 వ అధ్యాయంలో మంచి సమరయుడు దీనినే చేసాడు. తన ప్రయాణాన్ని అపి ప్రాణాముతో కొట్టి మిట్టాడుతున్న అతనిని లేపి తనతో తీసుకు వెళ్లి పూట కుళ్ళ వాని ఇంటికి తీసుకువెళ్లి పరామర్శించాడు అని చదువుతున్నాం. ఇలాగు జీవితంలో అనేక కారణముల చేత అలసిపోయి, పడిపోయిన వాళ్ళను పైకి లేపుట ప్రముఖ్యమైన కార్యము అని బైబిల్ చెబుతుంది.
దీనిని చదువుతున్న ప్రియమైన స్నేహితులారా! ప్రభువుని అంగీకరించి జీవిస్తున్న ఈ జీవితంలో ప్రాముఖ్యమైన కార్యం ఇతరులను పైకి లేపుట. మనము ఉంటున్న బడిలో, పనిచేస్తున్న స్థలాల్లో, ఆఫీసులో, పరిచర్య చేస్తున్న ఫీల్డ్ లో మన చుట్టూ అనేకులు అనేకమైన కార్యముల ద్వారా బలహీనపడి పడిపోతుంటారు. అటువంటి వాళ్ళను లేపే స్థానములో మనము ఉన్నాం అనేదాన్ని మర్చిపోకూడదు. ఇలాగు మనము చేసేటప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు చూసి సంతోషిస్తారు. జీవిత పరుగులో అనేక కారణముల చేత నిరుత్సాహపడిపోయి కింద పడిపోతున్న వాళ్ళు అనేకులు వాళ్ళ కొరకు మన పరుగును అపి కొంచం నిలబడి వాళ్ళ మీద శ్రద్ధ చూపించి వాళ్ళను పైకి లేపాలి.
- బ్రదర్. టి. శంకర్ రాజన్
ప్రార్థన అంశం:-
గాడిదల గ్రంధం అని సేవకుల కొరకు ముద్రించబడుతున్న మాస పత్రిక తరుచుగా ముద్రించ బడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250