దిన ధ్యానము(Telugu) 26.03.2021
దిన ధ్యానము(Telugu) 26.03.2021
ప్రార్థన చేస్తాము.
"నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును" - యోహాను 15: 7
ఉజ్జీవపు యోధుడైన జాన్ వెస్లీ కాలంలో ఆ దేశంలో దేవుని భక్తి కలిగిన కొందరు సహోదరులు కలిసి ఊరు బయట ఉన్న పొదల్లో ప్రార్థన చేయుట వాడుక. ఆ ప్రాంతం దేవుని దర్శనము పొందుకొనే ప్రార్థన స్థలంగా మారింది. ఆ స్థలములో దేవుని ప్రసన్నత, మహిమ ఎనలేని విధముగా ఉండుటయు, ఒక ప్రత్యేకమైన పరలోక అనుభవములో వెస్లీ నడిపించబడుటయు అతనితో ఉన్న సహోదరుల ద్వారా అనేక సాక్ష్యములు విన్నారు. అప్పటికి వెస్లీ వారు చెప్పిన మాటలు నమ్మలేదు. తరువాత దినాల్లో తాను దేవుని వలన తాకబడి రక్షణ అనుభవము లోనికి వచ్చిన తరువాత అతని కాళ్ళు తనకు తెలియకుండానే ఆ ప్రార్థన స్థలం వైపునకు పరిగెత్తడం మొదలుపెట్టాయి. ఆ స్థలములో అనేక మంది దేవుని పిల్లలు తరుచుగా ప్రార్ధించుచు వచ్చుట వలన ఆ దైవిక ప్రసన్నత ఆ స్థలములో నిండియుండుట వలన ఆయన త్వరగా దేవుని దగ్గరకు చేరుకోనుటయు గ్రహించగలిగారు.
దావీదు రాజు దేవుని యొక్క ఆలయము కట్టుటకు ఒక ప్రత్యేకమైన స్థలమును ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థలమే దేవ దూత తనకు ముందు దర్శనం ఇచ్చిన స్థలము. కాబట్టి ఆ స్థలమును దావీదు దేవుని ఆలయము కట్టుటకు ప్రతిష్టించారు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఏకాంతంగా ప్రార్ధించుటకు ఒక స్థలాన్ని, సమయాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన ఒలీవ కొండ పైన గెత్సేమనే తోట మరియు అరణ్యమైన ఒక ప్రాంతం అని తన కొరకు ఒక ప్రార్థనా స్థలమును ఏర్పరుచుకున్నారు. ఇక్కడ ఏకాంతంగాను, శిష్యులతోను, చీకటిగా వుంటుండగానే రాత్రి అంతా కూడా ప్రార్ధించేవారు. ఆ దినమునలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ముగించుటకు కావలసిన దేవుని శక్తిని దైర్యముతో పొందుకున్నారు.
ప్రియమైన స్నేహితులరా! మీ యొక్క జీవితంలో కూడా ప్రార్ధించుటకు ఒక స్థలాన్ని ఏర్పరచుకోండి. ఆ స్థలములో శక్తి ఉంది అని చెప్పడం లేదు కాని వాడుకగా ప్రార్ధించే స్థలములో దేవుడు మనలను దర్శించుటకు వచ్చేస్తారు . కాబట్టి దేవుని మహిమను, శక్తిని బలముగా అనుభవించగలము. అయస్కాంతం ఉన్న స్థలములో దాని చుట్టూ ఆకర్షించే శక్తి ఉంటుంది. సువాసన గల పువ్వులు అమ్మబడుతున్న స్థలములో ఆ పువ్వుల యొక్క పరిమలమైన సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అలాగే దేవుని పిల్లలు కలిసి ప్రార్ధించే స్థలములో దేవుని ప్రసన్నత మహిమ దిగి వస్తుంది. హల్లెలుయా!
- బ్రదర్. ఎమ్. జాన్
ప్రార్థన అంశం:-
మోక్ష ప్రయాణము అనే పత్రిక ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లో ముద్రించబడుటకు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250