దిన ధ్యానము(Telugu) 25.03.2021
దిన ధ్యానము(Telugu) 25.03.2021
పక్కనే ఉన్నవారు.
"తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు" - కీర్తనలు 145:18
జేమ్స్ అనే ఒక యవ్వనస్తుడు వున్నాడు ఆయనకు ఎవ్వరు లేరు. అతనికి దేవుని గురించి ఎక్కువగా తెలియదు. రోజు మధ్యాహ్నం భోజన సమయానికి పక్కనే ఉన్న దేవాలయమునకు వెళ్లి యేసయ్య నేను జేమ్స్ వచ్చియున్నాను అని చెప్పి వచ్చేస్తుఉండే వాడు. ప్రతిరోజు ఇలాగు మనస్ఫూర్తిగా చేసేవాడు. ఒక దినము పనికి వెళ్లేటప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన కాలు బలముగా దెబ్బతింది. కాబట్టి దగ్గర ఉన్నవాళ్లు ఆయనను తీసుకొని వెళ్ళి హాస్పిటల్ లో చేర్పించారు. ప్రభుత్వ హాస్పిటల్ లో మధ్యాహ్న బోజనము అతని పక్కనే ఉన్న టేబుల్ పైన పెట్టబడింది. కాని అతని హృదయము ఆ దేవాలయము వైపునకు వెళ్ళింది. ఈ సమయంలో నేను ప్రతిరోజు యేసయ్యేను చూచుటకు వెళ్ళేవాడినే అని ఆలోచిస్తూ కళ్లు మూసుకున్నాడు. ఆయన ఉండిన గది అంత ఒక ప్రకాశమైన వెలుగుతో నిండిపోయింది. దానిలోనుండి ఒక స్వరము జేమ్స్ నేను యేసు క్రీస్తును వచ్చియున్నాను. దానిని విన్న జేమ్స్ సంతోషంతో నిండిపోయాడు. ఆ క్షణమే సంపూర్ణ ఆరోగ్యం పొందుకున్నడు.
బైబిల్లో సమూయేలు గురించి చదువుతున్నాం. ఆయన పసి బాలుడుగా ఉన్నప్పుడే దేవాలయంలో విడిచిపెట్టబడ్డాడు. అక్కడే పెరిగాడు. ఆయన దేవునికి, మనుష్యునికి ఇష్టముగా జీవిస్తూ, దేవుని పనులను నిజముగా చేస్తూ వచ్చారు. దేవుడు ఆయనను వెతుకుతూ వచ్చి సమూయేలు, సమూయేలు అని పేరు పెట్టి పిలిచారు. అవును ఆయన నిజముగా తనను వెతికే వారిని వెతికి వచ్చే దైవము.
అవును యేసుక్రీస్తుని మనము వెతుకుతూ మనము వెళ్లవసరం లేదు ఆయన మనలను వెతుకుతూ వస్తారు. మన దగ్గరే ఉంటారు. మన పేరు పెట్టి మనలను పిలుస్తారు. నిజంగా ఆయనను ప్రేమించే వారిదగ్గరే ఆయన వుంటారు. మీరు ఒంటరిగా వుండేటప్పుడు, ఆదరణ లేకుండా వుండేటప్పుడు, ఎటువంటి పరిస్థితిలోనైన మీకు సహాయము చేసి మిమ్మల్ని విడిపించుటకు ఆయన వస్తారు. ఈ దినమే ఆయనను పిలుస్తారా? ఆయన కచ్చితంగా సహాయము చేస్తారు, జవాబు ఇస్తారు.
- శ్రీమతి. అక్షల్ సుఖదేవ్
ప్రార్థన అంశం:-
రాగ్ ల్యాండ్ బైబిల్ కాలేజీలో ఉత్తర భారతదేశం నుండి నూతన విద్యార్థులు పాల్గొనేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250