దిన ధ్యానము(Telugu) 23.03.2021
దిన ధ్యానము(Telugu) 23.03.2021
వెలుగుగా ఉందాం.
"మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగై యుండనేరదు" - మత్తయి 5:14
వైద్యుల యొక్క తప్పిదమైన చికిత్స వలన పుట్టి 6 వారములు అయిన ఫెన్ని క్రాస్పే (fanny crospy) తన రెండు కళ్ళు దృష్టిని కోల్పోయి పరితాప కరమైన పరిస్థితి ఏర్పడింది. పువ్వులను వాటి వాసనను బట్టి అది ఏ పువ్వు అని చెప్పగలిగిన సామర్ధ్యం గల వ్యక్తిగా మారారు. బైబిల్లో అనేక భాగములను ఆమె అమ్మమ్మ సహాయముతో కంటస్తం చేసి పెట్టి యుండుట వలన అది ఆమెను ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించుటకు సహాయపడింది. ఈమె తన 15వ యేటలో అంధుల బడిలో చేరి చక్కగా తన చదువును పూర్తిచేసి అక్కడే సమర్పణ గల ఉపాధ్యాయినిగా పని చేసారు. తన జీవితం అంత కూడా దేవుని నామం ఘనపరచుటకు సమర్పించుకున్న ఈమె 8000 పాటలకు పైగా రచించి వాటికి సంగీతం కూర్చి గొప్ప సంగీత కళాకారులుగా అయ్యారు. ఈమె రాసిన పాటల్లో తమిళ భాషలో తర్జుమా చేయబడి ఈ దినము వరకు పాడుతూ ఉన్నారు. రెండు కనుల యొక్క దృష్టిని కోల్పయిన ఈమె అనేకులకు అనేక విధములైన సహాయములు చేసి వెలుగు గల కుమార్తెగా పేరు తెచ్చుకున్నారు. ఈమె యొక్క పాటల ద్వారా అనేకులు యేసుక్రీస్తు యొక్క వెలుగులో చేర్చబడ్డారు.
పరిశుద్ధ బైబిల్లో యేసుక్రీస్తు యెరికోకు సమీపించి నప్పుడు ఒక గుడ్డి వాడిని చూసి వాడికి దృష్టిని దయ చేశారు. ఆయన దృష్టిని పొందుకున్న తరువాత తన ఇంటికి కూడా వెళ్లకుండ, తన కొరకు జీవించ కుండ యేసయ్య వెంబడించి ఆయన కొరకు వెలుగుగా జీవిచడం ప్రారంభించారు. దానిని చూసిన అనేక మంది యేసుక్రీస్తుని మహిమపరిచారు.
అవును ప్రియమైన వారలారా! లోకమును తన కనుదృష్టితో చూడలేని ఫెన్ని క్రాస్పే తనను చూసి లోకము ఆశ్చర్య పడే విధముగా ఆమె జీవితాన్ని యేసయ్య వెలుగుగా మార్చారు. మార్గములో కూర్చొని బిక్షం అడుగుతున్న గుడ్డివాడి జీవితాన్ని చూసి ఆయనలో ఉన్న వెలుగును చూసి దేవున్ని మహిమపరిచారు. ఈ లోకములో అనేకులు యేసు అనే వెలుగు లేకుండా జీవిస్తున్నారు. పాపము, శాపము, బాధలు, రోగము, కన్నీరు అనే చీకటిలో రోజు రోజుకు మరనిస్తున్నారు. అటువంటి వారిని చీకటిలోనుండి రక్షణ అనే వెలుగులోకి నడిపించేది దేవుని వెలుగు. మనం కూడా అనేకులకు వెలుగులోకి తీసుకువస్తాం. వాళ్ళను వెలుగు గలిగిన పిల్లలుగా మారుద్దాం. హల్లెలుయా!
- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్
ప్రార్థన అంశం:-
ఒడిశా నారాయణ పట్టణ ప్రాంతంలో పరిచర్యను బాధ్యత కలిగి నడిపించే నాయకులు లేచేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250