Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 22.03.2021

దిన ధ్యానము(Telugu) 22.03.2021

మీరు సువాసనై యున్నారు.

"రక్షింపబడువారిపట్లను నశించువారిపట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయైయున్నాము" - 2కోరింథీయులకు 2: 15

అమెరికాలో 35వ రాష్ట్రపతిగా ఉండిన జాన్ ఎఫ్ కెనడీ తన యవ్వన ప్రాయంలో సువాసన ఇచ్చే ద్రవం తయారు చేసే కంపెనీలో పని చేసారు. ఆయన తన పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆయన వీది చివరకు వచ్చేసరికి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ అతను వస్తున్నారు అని తెలిసిపోయేది. అంతగా ఆ వీది అంత సువాసన వస్తువుండేది. మనము కూడా ఇలాగు లోకమునకు సువాసన ఇవ్వడానికి పిలవబడి యున్నాము. అపోస్తూలుడైన పౌలు చెబుతున్నప్పుడు నాశనము వైపునకు నడిపించబడుతున్న వాళ్లకు మనము క్రీస్తు సువాసనగా ఉంటున్నాము అంటున్నారు. 

ప్రభువైన యేసుక్రీస్తుని మన జీవితం ద్వారా అనగా మన సత్క్రియల ద్వారా  ప్రత్యక్ష పరచడమే సాక్ష్యంతో జీవిచడం. మన క్రియలు ద్వారా యేసుక్రీస్తుని ఎలాగు వ్యక్తపరచగలం? 

నాన్న రూపము పిల్లల్లో కనబడటం వలన ఈయనేనా మీ నాన్న అని అడుగుతున్నాం. ఆలాగుననే మన పరమతండ్రి రూపములో మనము కెనడి వాడిన సువాసన ద్రవం వలె ఆయన గుణ లక్షణములను ప్రత్యక్షపరచాలి అప్పుడే మనము ఆయనకు సాక్షులము. తరువాత పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము పొందుకొని దేవుని సాక్షులుగా జీవించాలి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులైయుందురు. 

స్నేహితులరా ఈ దినము ప్రపంచములో మనమే మన సాక్ష్యం ద్వారా క్రీస్తుని లోకానికి ప్రత్యక్షపరచాలి. ఎలాగు ఆ సువాసన ద్రవం ప్రజలను ఆకర్షిస్తుందో అలాగే మన పవిత్రమైన మంచి మాటలు, కనికరము గల క్రియలు ఇతరులను ఉత్సాహ పరచుట ఇలాంటి గుణ లక్షణములు ఇతరుల యొక్క హృదయములు దేవుని వైపునకు తిప్పే విధముగా ఉండాలి. సువాసన కలిగి జీవిద్దాం, యేసు క్రీస్తుని  వ్యక్తపరుద్దాం.
-    శ్రీమతి. జాస్మిన్ శామ్యూల్

ప్రార్థన అంశం :-
ఒడిశాలో గుమ్మా బ్లాక్ అనే ప్రాంతంలో  నూతన ఫీల్డ్ ప్రారంభించబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)