Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 13.03.2021

దిన ధ్యానము(Telugu) 13.03.2021

అద్భుతము:-

"దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత(అనగా-సాతానుచే) పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను" - అపో.కార్యములు 10: 38

శ్రీలంక దేశంలో జీవించి వచ్చిన ఒక సహోదరి కి 6నెలలుగా తన రెండు కాళ్ళ తో నడవలేకపోయేవారు ఆమె యొక్క తల్లిగారు ఒక దేవాలయమునకు  పిలిపించుకుని వెళ్ళారు. అప్పుడు అక్కడ ఉన్న సేవకుడు ప్రార్ధన చేసారు. ఆ సహోదరి అయితే నా కాళ్ళు మండుతూ ఉన్నయ్. కాలుతున్నాయ్ అని అరుస్తూ ఉంది. ఆమె కోసం ఆ సేవకుడు ప్రార్ధన చేయడం మొదలుపెట్టారు. యేసు అద్భుతం చేస్తారు అని తన రెండు చేతులు పైకి లేపి నడిపించడం ప్రారంభించారు. ఏమిటి ఆశ్చర్యం అంటే 6నెలలుగా నడవలేకుండా ఉన్నాను ఇప్పుడే , యేసు నామంలో నడవగలుగుతున్నాను అని ఆ సహోదరి సాక్ష్యం చెప్పగలిగారు.

ఇలాగే మనము ఈదినము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి ని చూస్తున్నామ్ తన యొక్క తల్లి గర్భము నుండే కుంటివాడుగా పుట్టిన ఒకడు ఉన్నాడు అతనును చూచిన తల్లిదండ్రులకు బాధకరంగా ఉంటుంది. ఎందుకంటే 40సంవత్సరాలుగా రోజూ మోసుకొని, తన యొక్క ఊరిలో గల దేవాలయం వద్ద కూర్చోబెడతారు.

ఒక దినము ఆ మార్గములో దేవాలయమునకు వస్తున్న పేతురు, యోహానును చూచి భిక్షము అడుగుతున్నాడు. అప్పుడు పేతురు, యోహాను అతని వైపు చూచి , మమ్మల్ని చూడుము అని చెబుతున్నారు. అప్పుడు అతను వారి యొద్ద ఏమైనా దొరుకును తన కుటుంబానికి కావాల్సినది ఏదైనా దొరుకుతుంది అని ఆలోచించి వారిని చూచి నప్పుడు వారు మాయొద్ద బంగారము, వెండి లేదుగాని మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము ఆని చెప్పి అతని చేతుల్ని పట్టుకొని లేపి యేసుక్రీస్తు నామములో లేచి నడువుము అని చెబుతున్నారు. వెంటనే ఆయన వారితో నడుస్తూ దేవాలయములోనికి వెళ్లారు అని చదువుతున్నాం. 

ఆవును ప్రియమైన వారలారా! ,యేసుక్రీస్తు నామము ఒక సాదరమైన నామము కాదు. యేసుక్రీస్తు నామములో ప్రార్దించినప్పుడు రోగముల నుండి విడుదల, అద్బుతములు జరుగుతాయి. అద్భుతములు పొందుకున్నవారు తమంతట తామే దేవలయములోనికి వస్తారు. ప్రభువుని వెంబడిస్తారు. కాబట్టి రోగుల కొరకు ప్రార్ధించే తరుణం వచ్చినప్పుడు దానిని వాడుకొని విశ్వాసంతో ప్రార్దిద్దాం. దేవుడు స్వస్థపరుస్తారు అనేకులు యేసుక్రీస్తు యొద్దకు చేర్చబడతారు. ఆమెన్.
-    శ్రీమతి. రూబీ 

ప్రార్థన అంశం
లక్ష గ్రామములను దత్తతు తీసుకొనే లక్ష వ్యక్తులు లేచేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)