దిన ధ్యానము(Telugu) 12.03.2021
దిన ధ్యానము(Telugu) 12.03.2021
దేవుని చిత్తమా? నరుల చిత్తమా?
"అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను" - అపో.కార్యములు 13: 22
ఒక యవ్వనస్తుడు తన చదువుని పూర్తి చేసుకొని తన కుటుంబము యొక్క కష్ట పరిస్థితిని బట్టి పనికి వెళ్ళాడు. ఇంచుమించు సంవత్సరం పని చేసి ఉంటాడు. ఈలోగా శరీరంలో బలహీనత ఏర్పడి వచ్చిన రోగము వలన పని చేయలేని పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వచ్చేసాడు. మంచిగా సంపాదించి తన కుటుంబాన్ని పేదరికంనుండి మార్చి తన కుటుంబాన్ని మంచి స్థితికి తీసుకువస్తాడు అన్న ఆశ నిరాశగా మారిపోయింది. తల్లి కన్నీరు విడచి ప్రార్ధించినప్పుడు దేవుడు ఒక కార్యాన్ని గుర్తు చేశారు. ఆయన జన్మించక ముందే మీరు నాకు ఒక మగబిడ్డను దయచేసిన యెడల ఆ మగ బిడ్డను నేను మీ పరిచర్యకు ఇస్తాను అని ఆమె చేసిన ప్రార్థన చేసే వారు. దేవుడు ప్రార్థన అలకించి ఆమెకు ఒక బాబును ఇచ్చారు. దేవుడు ఆమె చేసిన సమర్పణను గుర్తు చేశారు. ప్రభువు యొద్ద తన తప్పిదమును ఒప్పుకొని వీడి వలన మాకు లక్ష రూపాయలు ఆదాయము వచ్చిన అది మాకు వద్దు అని చెప్పి తన కుమారుడ్ని దేవుని చిత్తాను సారంగా దేవుని పరిచర్యకు సమర్పించారు. మనిషిగా తనకు ఉన్న వాంఛను విడిచి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు. దేవుడు వారియొక్క సమర్పణను చూచి తన బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఈ దినము వరకు అతనిని దేవుని పనిలో వాడుకుంటున్నారు.
దేవుని చేత ఏర్పరచబడి తన జనమును పరిపాలించుటకు దేవుడు సౌలును రాజుగా అభిషేకించారు. ఇతను అయితే దేవునికి విధేయత చూపించకుండ తన ఇష్టానుసారంగా జీవించారు. అందువలన దేవుడు అతనిని రాజుగా చేసినందుకు దేవుడు పశ్చాత్తాప పడ్డారు. అతనిని త్రోసివేసి అతని హృదయనుసారమైన దావీదును చూచి దేవుడు అతనిని రాజుగా అభిషేకించారు. ఆయన దేవునికి ఇష్టమైన అన్నింటిని చేసాడు కాబట్టి దేవుడు దావీదు గురించి సాక్షం పలుకుతున్నారు.
ప్రియమైన వారలారా! దీనిని చదువుతున్న మీ గురించి ఏమిటి? దేవుడు ఈ ప్రపంచములో సృష్టిచిన ప్రతి మనుష్యుని గురించి ఇక ఉద్దేశం లేకుండా సృష్టించలేదు. సౌలు తన ఇష్టానుసారంగా జీవించి తిరస్కరించబడ్డాడు కాని దావీదు అయితే దేవుని ఇష్టానుసారంగా జీవించి దేవుని హృదయనుసారుడు అని మంచి సాక్షము పొందుకున్నాడు. మనము కూడా దేవుని చిత్తాన్ని చేసి జీవిద్దాం దేవుని చేత మంచి సాక్ష్యం పొందుకుందాం.
- బ్రదర్. ఏ. ఇమ్మనుయేల్
ప్రార్థన అంశం:-
7000 సేవకులను సపోర్ట్ చేసే 7000 ప్రార్థన గుంపులు ఏర్పాడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250