దిన ధ్యానము(Telugu) 10.03.2021
దిన ధ్యానము(Telugu) 10.03.2021
"దేవుడు ఇచ్చే దీవెన"
"యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు" - సామెతలు 10: 22
ఒక రాజు తన భవనంలో ఉన్న ఒక సైనికుడు ఎప్పుడు సంతోషంతో ఉన్న దానిని గమనించి మంత్రితో ఈయన మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉండ గల్గుతున్నాడు అని అడిగారు. దానికి మంత్రి కొంత సమయం ఆలోచించి రాజు యొద్ద 99 బంగారు నాణెములను తీసుకొని ఒక సంచిలో వేసి దాంట్లో " రాజు యొక్క బహుమానం 100 బంగారు నాణెములు" అని రాసి ఆ సైనికునికి ఇచ్చారు. ఆ సైనికుడు ఇంటికి వెళ్ళి లెక్క చూసినప్పుడు 99 మాత్రమే ఉండుట చూసినప్పడు తన భార్య పిల్లలను పిలిచి తప్పిదము జరిగింది అని ఇల్లంతా వెతికి చూసి కోపపడ్డారు. మరుసటి దినములో మిక్కిలి చింత కలిగి యుండుట చూసి మంత్రి ద్వారా జరిగినది తెలుసుకున్న రాజు తాను పొందని ఒక బంగారు నాణెమును గూర్చి తన సంతోషాన్ని పోగొట్టుకొన్నాడే అని రాజు ఆలోచించారు.
బైబిల్లో కూడా సిరియా దేశపు సైన్యాదిపతి అయిన నయమాను తన కుష్టు రోగము పొగొట్టుకొనుటకు దేవుని సేవకుడైన ఎలీషా ను వెతుక్కొని వచ్చారు. ఎలీషా యొక్క మాట ప్రకారం యొర్దాను నదిలో 7 మార్లు మునిగిన తరువాత తన కుష్ఠు రోగము నయమైపోయింది. దానికి గల కానుకను ఎలీషాకు ఇచ్చినప్పుడు ఆయన దానిని తీసుకొనుటకు తిరస్కరించాడు. కాని ఎలీషా దాసుడైన గేహజీ దానిని ఆశించి నయమాను రధం వెంబడి వెళ్ళి ఎలీషా ప్రవక్త అడిగారు అని ఆ వస్తువులను తీసుకొనినందున నయమానును విడిచిపెట్టిన కుష్ఠురోగము గేహజీకి ఆయన సంతతికి వచ్చింది అని చదువుతున్నాం. అలాగే మన జీవితంలో కూడా దేవుడు అనేక ఆశీర్వాదములు ఇచ్చినప్పటికీ లేని వాటికొరకు వెతికి జీవితాన్ని నష్ట పరుచుకున్నవారు కూడా కలరు. దేవుడు ఇచ్చిన పని కుటుంబము, అంతస్తు, తలాంతులు వీటన్నింటిలో సంతృప్తి కలిగి మనము వుంటున్నామా? లేదా దేవుడు నాకు ఏమి ఇచ్చారు అని సణుగుకొంటున్నమా? ధన ఆశ సమస్త కీడులకు మూలము అని గ్రహించ కుండ గేహజీ వలె శాపమును పొందుకున్న వారు కూడా కలరు. దేవుడు మనకు ఇచ్చిన విలువకలిగిన రక్షణను గుర్తుంచుకొని ఇహలోక కార్యములను మనస్సున పెట్టుకొని ఇష్టానుసారంగా జీవించకుండ దేవుడిచ్చిన దీవెన కొరకు ఆయనను స్తుతించి ఆయన ఇచ్చే కృపను పొందుకుందాం.
- శ్రీమతి. వసంతి రాజా మోహన్
ప్రార్థన అంశం:-
7000 మంది మిషనరీలను సపోర్ట్ చేసే 7000 కుటుంబాలు లేచేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250