దిన ధ్యానము(Telugu) 09.03.2021
దిన ధ్యానము(Telugu) 09.03.2021
వివేకము గల హృదయం.
"యెహోవా, నా మొఱ్ఱ నీ సన్నిధికి వచ్చునుగాక నీ మాటచొప్పున నాకు వివేకము నిమ్ము" - కీర్తనలు 119:169
ఒక సర్కస్ లో జోకర్లు అనేకులు నిలబడి అందర్ని నవ్విస్తున్నారు. జనాలు అందరు కూడా తమ్మును తాము మర్చిపోయి వాళ్ళు చేస్తున్న చేష్టలు, అల్లరి పనులను చూసి ఆనందిస్తున్నారు. హఠాత్తుగా ఆ సర్కస్ యజమాని ముందుకు వచ్చి ఆ సర్కస్ గుడారమునకు నిప్పు అంటుకున్నది కనుక వెంటనే ప్రజలు అందరు బయటకు వెళ్ళాలి అని చెప్పారు. కాని ప్రజలు అయితే అదికూడా ఒక హాస్యాస్పదంగా తీసుకొని ఇంకను నవ్వడం ప్రారంభించారు. దానిని చూసిన యజమాని అందరిని బయటకు వెళ్ళమని బ్రతిమలాడుకున్నారు. మంటలు ఇంకా ఎక్కువగా చెలరేగుతున్నాదానిని చూసిన ప్రజలకు అర్ధం అయ్యింది అది నవ్వుకొరకు కాదు అది నిజమే అని. అప్పటికే ఆ గుడారము అంతా అగ్ని వ్యాపించుట వలన ప్రాణముతో బయటపడిన వారు తక్కువ మందే.
సుఖముగా జీవించిన ఒక ధనవంతుని గురించి బైబిల్లో వ్రాయబడిఉంది. తన ఇంటి ముందు అనారోగ్యంతో బాధపడుతూ భిక్షం అడుగుతున్న లాజరు పైన కనీసం కనికరం కూడలేదు. ఆయనకు సహాయం చేయాలి అని హృదయం కూడా లేదు. మరణము వరకు ఆయన హృదయంలో స్పర్శ లేకుండా ఉంది. ఒక దినము ఇద్దరు కూడా మరణించారు. లాజరు పరలోకంలో, ధనవంతుడు నరకంలో ఉన్నారు. నరకంలోనికి వెళ్లిన తరువాత ధనవంతునికి వివేకమైన మనస్సు వచ్చింది. తన వలె భూమి మీద జీవిస్తున్న తన సహోదరుల కొరకు చింతిస్తున్నాడు. వాళ్ళు రక్షించబడటానికి లాజరును పంపించమని అడుగుతున్నాడు. కాని అది కుదరలేదు.
పైన చూసిన రెండు సంఘటనలు మనం చదివినప్పుడు అల్పమైన సంతోషము కొరకు ప్రజల యొక్క హృదయంలో స్పర్శ లేకుండా వున్నారు. ఐశ్వర్యవంతుడు తనకు ఐశ్వర్యం ఇచ్చిన దేవున్ని గుర్తించకుండా హృదయంలో వివేచన లేకుండా మరణించి సమాధి చేయబడ్డాడు.
అవును ప్రియమైన వారలారా! మనకు వివేకము గల హృదయం కావాలి. మనకు భూమి మీద జీవించుటకు ఇవ్వబడిన దినములు చాలా స్వల్పమైనవే. ఆ కొద్ది దినములైన దేవునిలో వివేకము గల మనస్సాక్షితో జీవిద్దాం. తోచినంత సహాయం చేసి ముందుకు వెళ్తాం, సహాయం చేయకుండా ఉండిన యెడల ఆదరణ లేకుండా వున్న అనేకులకు యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగు వ్యక్త పరచగలం. నాశనం వచ్చినప్పుడు వివేకము లేకుండా ఉండిన యెడల వచ్చే ఉగ్రతను మనము ఎలాగు తప్పించుకోగలము.
- శ్రీమతి. శసికళ శివ.
ప్రార్థన అంశం:-
ఈ దినము జరుగుతున్న పార్టనర్ షిప్ మిషనరీల కూడికలో పాల్గొనే సేవకుల కొరకు ప్రార్థిద్దం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250