దిన ధ్యానము(Telugu) 08.03.2021
దిన ధ్యానము(Telugu) 08.03.2021
శ్రేష్ఠమైన స్త్రీ పెబెయ
"చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును" - సామెతలు 31: 31
1839 వ సంవత్సరం మార్చి 8వ తారీఖు న్యూయార్క్ లో నివసించి వచ్చిన డాక్టర్ వాల్టర్ దంపతులకు పెబెయ అనే కుమార్తె జన్మించింది. శ్రేష్ఠమైన భక్తి జీవించి వచ్చిన ఈ కుటుంబీకులు చిన్న ప్రాయం నుండే పెబెయను దేవుని భక్తిలోను, ప్రేమలోను పెంచుతూవచ్చారు. యవ్వన ప్రాయం వచ్చేసరికి జోసెఫ్ నాట్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఈయన కూడా గొప్ప ధనవంతుడే.
గొప్ప ధనవంతురాలుగాను, ప్రఖ్యాతిగాంచినదిగా ఉండిన పెబెయ సంఘంలోను, సమాజంలోను సంస్కరణ రావాలని కోరికతో పేదలు, సమాజంలో నలగగొట్టబడిన ప్రజలను, క్రిందిస్తాయి ప్రజలు అని అన్నీ కోవలకు చెందిన ప్రజలకు మనస్ఫూర్తిగా సేవ చేస్తూ వచ్చారు. తరువాత ఇంటర్నేషనల్ సన్ షైన్ అనే సంస్థను ఏర్పరిచి పేద వాళ్ళను, తిరస్కరించ బడినవారు, విధవరాళ్ళు యొక్క జీవితములను వెలిగింపజేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ పనిచేస్తూ వచ్చింది. ఈ సంస్థకు నాయకురాలిగా ఎంపిక చేయబడిన పెబెయ అనేకమైన పేద స్త్రీలకు, పిల్లలకు, పెద్దలకు అని తమ యొద్ద సమస్యలు చెబుతున్న అందరికి తన యొక్క సంపూర్ణ సహాయం చేసి వాళ్ళ యొక్క జీవితములను వెలిగించారు.
పెబెయ నాట్ మ్యూజిక్ లోను శ్రేష్ఠమైన వ్యక్తిగా సాయంకాలము వేళల్లో మ్యూజిజ్ ప్రోగ్రామ్లు చేస్తూ వచ్చారు. ఆ దినాల్లో ప్రఖ్యాతి గాంచిన పాటల రచయితలకు ఆమె సంగీతాన్ని సమకూర్చారు. మంచి ప్రసంగి కూడా దాని వలన అనేక క్రైస్తవ పుస్తకాలు కూడా రాశారు. ఒక దినము తన సంఘపు సభ్యురాలైన కనులు లేని ఫెన్ని క్రాస్బే ను చూచుటకు వాళ్ళ ఇంటికి వెళ్లారు. నా మనస్సులో ఒక ఇంపైన రాగము వస్తుంది కాబట్టి నేను వాయిస్తాను మీరు దానిని రాయండి అని అన్నారు. మోకరించి ప్రార్దించిన ఫెన్ని ఖచ్చితంగా మీరు నా సొంతమే యేసు మీరు నా సొంతమే ఇది దైవిక మహిమ అనే పాటను రాసి ముగించారు. ఇది (blessed assurance Jesus is mine) ప్రఖ్యాతి గాంచిన పాటగా పేరుపొందిది.
నా ప్రియమైన వారలారా! మన చుట్టూ నిరుత్సాహపడి పేదరికంలోను, అనేకమైన సమస్యలలో నలిగిపోయిన వారు అనేక మంది ఉన్నారు. దేవుడు మనకు ఇచ్చిన తలాంతులను, ధనమును ఇతరుల కొరకు ఖర్చు పెడదాం. అవసరతలో ఉన్న వాల్ల యొక్క హృదయాన్ని ఓదార్చి వాళ్ళను మెరిపింప జేయుటకు మనలను మనము సమర్పించుకుందాం. దేవుడు మనలను శ్రేష్ఠమైన స్త్రీలుగా జీవించుటకు కృప దయచేయును గాక! ఆమెన్. ఇంపైన స్త్రీల దిన శుభాకాంక్షలు.
- శ్రీమతి. సరోజా మోహన్ దాస్.
ప్రార్థన అంశం:-
ప్రార్థనా గుడారము యొక్క కట్టడ పనుల యొక్క అవసరతలు తీర్చబడేటట్లు ప్రార్థిద్దం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250