Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 07.03.2021 (Kids Special)

దిన ధ్యానము(Telugu) 07.03.2021 (Kids Special)

నీతోనే వస్తున్నారు. 

"…దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును" - యెహోషువ 1: 9

హాలో పిల్లలు ఎలా ఉన్నారు? ఈ దినము మన ప్రతి ఒక్కరినీ యేసయ్య ఎలా సంరక్షిస్తున్నారో అనే కథ విందమా.

చల్లగా పారుతున్న నదికి అవతల ఒక అందమైన గ్రామము ఉన్నది. ఆ గ్రామం ఎప్పుడు పచ్చిక కలిగి పచ్చగా ఉండేది. అక్కడే జెన్సీ అనే పాప కుటుంబం ఉండేది. జెన్సీ బాగా ప్రార్ధించి బైబిల్ చదివే అమ్మాయిగా, సండే స్కూల్ కి తప్పకుండా వెళ్లే అమ్మాయిగా ఉండేది. ఆమెకు అమ్మ నాన్న లేనందున అమ్మమ్మ దగ్గర పెరుగుతుంది. స్కూల్ కి వెళ్ళేటప్పుడు నడిచే వెళ్ళేది. ఆమె యొక్క స్నేహితులు అందరూ సైకెల్ పైన మరికొందరు వాళ్ళ తల్లిదండ్రులు యొక్క బైక్ పైన వెళ్లేవారు. జెన్సీ మాత్రం ఒంటరిగా నడుచుకొని వెళ్ళేది. తాను ఒంటరిగా నడుస్తూ వెళ్ళేటప్పుడు తాను సండే స్కూల్లో నేర్చుకున్న పాటలను పాడుతూ, కంటస్తా వాక్యాన్ని చెప్పుకొంటూ వెళ్తుంటాది. 

ఇక దినము ఆమె స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఆమెను ఎవరో వెంబడించినట్లు అనిపించింది. వాక్యాన్ని చెప్పుకొంటూ పరిగెత్తుకొని స్కూలుకి వెళ్ళింది. స్కూల్ అయిపోయిన తరువాత ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఎవరో తనని వెంబడించినట్లు అనిపించింది. తిరిగి చూడటానికి కూడా జెన్సీ కి భయముగా అనిపించి పాట పాడుకొని పరిగెత్తుకొని ఇంటికి వచ్చి చేరుకుంది. జరిగినది తన యొక్క అమ్మమ్మకు చెప్పింది. ఆమె భయపడకుము నీవు వెళ్లే స్థలం అంతటితో నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడుతారు అని ధైర్యం చెప్పింది. నీవు జ్ఞానంగాను, శ్రద్దగాను నడుచుకోవాలి అని సలహా చెప్పారు. తరువాత ఆదివారం ఆరాధనకు వెళ్ళేటప్పుడు జెన్సీ, అమ్మమ్మ కలిసి వెళ్ళారు. మార్గంలో పెద్ద మీసం పెట్టుకొని ఎత్తుగా ఉన్న ఒక ఆయన వాళ్లకు ఎదురుగా వచ్చి నిలబడ్డారు. నేను 4 రోజులుగా నిన్ను వెంబడిస్తూ నిన్ను ఎత్తుకు పోవాలి అని చూసాను కాని నీతోనే తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక అతను నడుస్తూ వచ్చారు అతను ఎవరు అని అడిగారు. దానికి అమ్మమ్మ అతనే యేసుక్రీస్తు అనియు, యేసుక్రీస్తు ఎలాగు తన పిల్లలను కాపాడుతున్నారో అతనికి వివరించారు. జెన్సీ పాటలు పాడుకొని అమ్మమ్మ చేతులు పట్టుకొని సంతోషంతో ఇంటికి చేరుకుంది. 

పిల్లలు కధ విన్నారు కదా మీరుకుడా రోజు ఎదుర్కొనే ప్రతికార్యాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పాలి. జెన్సీ యేసయ్యను వెతికినట్లుగా మీరు కూడా వెళ్తున్న ప్రతి చోట కీడు మీ దరికి రాకుండా యేసయ్యతో నడుస్తూ ఉంటే ఆయన కచ్చితంగా మిమ్మల్ని సంరక్షిస్తారు. మీకు కలిగే భయము అన్నింటిలో యేసయ్య మిమ్మల్ని విడిపిస్తారు. ఆయన నీకు కలుగుతున్న కీడులన్నింటినుండి మిమ్మల్ని తప్పించి సంరక్షిస్తారు. మీరు కూడా జెన్సీ వలె ఎక్సలెంట్ పిల్లలుగా మరిపోతారు. వెరీ గుడ్.
-    శ్రీమతి. అన్బు జ్యోతి స్టాలిన్.

ప్రార్థన అంశం:-
ఆఫీస్ పనికొరకు అత్యవసరమైన జిరాక్స్ మిషన్ కొనబడేటట్లు ప్రార్థిద్దం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)