Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 06.03.2021

దిన ధ్యానము(Telugu) 06.03.2021

క్షమించే గుణము.

"ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి" - కొలస్సీయులకు 3: 13   


ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో తరుచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఒక దినము జరిగిన గొడవ ముదిరిపోయింది. ఇద్దరు విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ దినము రాత్రి భర్త ప్రార్ధించుటకు వెళ్లారు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడారు. నేను నీవు చేసిన సమస్త పాపాన్ని క్షమించానే కాని నీవు మరలా మరలా తప్పిదములు చేస్తూ నా యొద్దకు వచ్చి క్షమాపణ అడిగినప్పుడు నేను నిన్ను క్షమించాను. నేను నీ పాపాన్ని క్షమించినట్లే నీ భార్య చేసిన తప్పిదములను క్షమించు అని మాట్లాడారు. క్రీస్తు నా పాపములను క్షమించినట్లుగా నేను నీ పాపములను క్షమిస్తున్నాను అని చెప్పి తన భార్యతో సమాధాన పడ్డారు ఆ భర్త. 

బైబెల్లో కూడా ఒక యజమానుని యొద్ద పదివేల తాలంతులు అప్పు ఉన్న ఒక పనివాడు తన యజమానుడు యొద్దకు వెళ్ళి తాను అప్పును తీర్చలేను అని సాగిలపడి క్షమాపణ అడిగాడు. అందుకు ఆ యజమాని కనికరపడి తన అప్పును క్షమించి వేశారు. ఆ పనివాడు బయలుదేరి వెళ్తుంటే తన యొద్ద 100 దేనారములు అప్పు  తీసుకున్న వ్యక్తిని చూచి తన అప్పును తీర్చమని తనని బలవంత పెట్టాడు. అప్పును తిరిగి ఇవ్వలేను అని క్షమాపణ అడిగినప్పటికి ఆయన ఆ పనివాడిని క్షమించలేదు. దీనిని విన్న యజమానుడు నేను నిన్ను క్షమించినట్టుగా నీవు కూడా అతనిని క్షమించవద్దా అని చెప్పి ఆయనను అప్పు అంతా తీర్చేవరకు అతనిని చెరసాలలో వేయమని ఆజ్ఞా పించారు. 

ప్రియమైన వారలారా! ఇలాగే మనయొక్క సమస్త పాపములు అన్నింటిని కూడా యేసు ప్రభువు సిలువలో క్షమించివేశారు. దీనిని గ్రహించి అనుభవిస్తున్న మనము ఇతరులు చేసిన తప్పిదములను క్షమించ కుండ హృదయము కఠినము చేసుకుంటున్నామా? అలోచిద్దాం. ఇతరుల యొక్క తప్పిదములను పెద్దగా ఆలోచించి వారిని క్షమించ కుండా ఉండే మన యొక్క మనస్తత్వాన్ని మారనివ్వండి. ఇతరుల యెక్క తప్పిదములను క్షమించని యెడల మన పాపములు కూడా క్షమించబడవు అని వాటన్నింటిని దేవుడు న్యాయ తీర్పులు దేవుడు మనకు చూపించి లెక్క అడుగుతారు. కాబట్టి ఈ దినమే ఇతరులను మనస్ఫూర్తిగా క్షమించి ఇతరులను అంగీకరించే దినముగా మారనివ్వండి.
-    బ్రదర్. ఎస్. గాంధీ రాజన్.

ప్రార్థన అంశం:-
ఆఫీస్ పనికొరకు అత్యవసరమైన జిరాక్స్ మిషన్ కొనబడేటట్లు ప్రార్థిద్దం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)