దిన ధ్యానము(Telugu) 05.03.2021
దిన ధ్యానము(Telugu) 05.03.2021
ఉన్నది ఉన్నట్టు చెప్పుడి.
"నీతిమంతునికి కలిగినది కొంచమైన శ్రేష్టము" - కీర్తనలు 37:16
నా కుమార్తె వివాహము కొరకు వరుడ్ని చూచుటకు బయోడేట రెడీ చేసాము. మాకు తెలిసిన వ్యక్తికి దానిని ఇచ్చినప్పుడు ఎన్ని తులాల బంగారము, ఎంత డబ్బులు ఇస్తారు అని అడిగారు. మాకు జవాబు ఏమి చెప్పాలో తోచలేదు ఎందుకంటే పరిచర్య చేస్తున్న మాదగ్గర చెప్పుకోదగ్గ ధనము మా చేతుల్లో లేదు. ఏమి చేయాలో ఆలోచించాము. ఆ దినము మా దేవాలయమునకు వెళ్ళి ప్రార్ధించడం ప్రారంభించాము. మా యొద్ద ఉన్న వస్తువులు అన్ని ప్రభువుకు చెప్పాను. ఇంత కొంచెము వస్తువులు పెట్టుకొని నేను మా కుమార్తెకు ఎలాగూ వివాహము చేస్తాను అని కలతతో కన్నీరు కార్చాను. ఆ దినము నా బైబిల్ ధ్యానమును చదివాను. నీతిమంతునికి కలిగినది కొంచమైనను బహుమందికి భక్తిహీనులకున్న ధనవృద్ధి కంటే శ్రేష్టము కీర్తనలు 37:16 ని దేవుడు నాకు చూపించి నన్ను ఓదార్చారు. దేవుని మీద ఆధారపడి నిరీక్షణతో వేచి ఉన్నాను. దేవుని యందు బయభక్తులు కలిగి పరిచర్య చేస్తున్న మంచి అల్లుడ్ని దేవుడు నాకు దయచేశారు.
బైబిల్లో 2వ రాజులు 4వ అధ్యాయంలో అప్పుల బాధల్లో ఉన్న ప్రవక్త యొక్క కుటుంబాన్ని చూస్తున్నాం. ఆయన భార్య యేలీషా యొద్ద నూనె కుండ తప్ప నా యొద్ద ఏమి లేదు అని చెబుతున్నారు. ఆమె ఉన్నది వున్నట్లుగా తన యొక్క కుటుంబ పరిస్థితిని చెబుతుంది. వెంటనే ఆమె యొక్క కొదువలన్ని కూడా తీర్చబడుతున్నాయి.
దీనిని చదువుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈ కార్యం కొరకు నేను ఏమి చేస్తాను, నా కుమార్తె యొక్క వివాహము, నా కుమారుడి యొక్క కాలేజ్ ఫీస్, నా ఇంటికి కట్టవలసిన అవసరతలు అన్నీ అనేకమైన కార్యములు గురించి కలత చెందుతున్నారా? అనేకుల యొద్ద మీ అవసరతలు చెప్పి సహాయము దొరకక చేయి విడువవలసిన పరిస్థితుల్లో కన్నీరు కార్చుతూ ఉన్నారా? ఈ మాట మీ కొరకే ఆ ప్రవక్త యొక్క భార్య యేలీషా ప్రవక్తతో తన కార్యాన్ని చెప్పినట్లు మీ కార్యాన్ని ఆకాశము, భూమిని సృష్టించిన దేవునికి చెప్పండి. మీ యొద్ద ఉన్న వస్తువులు, ధనము కొంచెము అయిన దాన్ని దేవుడు విస్తరింప చేసి మీ యొక్క కార్యములు అన్నీ కూడా సంపూర్ణముగాను, దీవెన కరముగాను జరిగేటట్లు ఆయన శక్తిమంతుడై యున్నారు.
- శ్రీమతి. వి.క్రిష్టి
ప్రార్థన అంశం:-
ప్రార్థన గుడారములో అత్యవరమైన పి.ఏ సిస్టమ్ కొనబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250