దిన ధ్యానము(Telugu) 03.03.2021
దిన ధ్యానము(Telugu) 03.03.2021
నీ కంటిలో దూలము:-
"నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల?" - మత్తయి 7: 3
ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో 2వ అంతస్తులో నివసిస్తూ వచ్చారు ఆ కుటుంబీకులు. ఒక సాయంకాలపు వేళలో భార్య, భర్త ఇద్దరూ కూడా పెద్ద అద్దం గల కిటికీ దగ్గర చైర్ లో కూర్చొని టీ తాగుతున్నారు. అప్పుడు ఎదురింటి వాళ్ళు ఆరబెట్టిన బట్టలు కిటికీ ద్వారా వచ్చి వాళ్ళ కంటి,లో పడింది. ఆ బట్టలన్నీ కూడా మిక్కిలి మురికిగా ఉన్నాయ్. భార్య, భర్త తో మన ఎదురింటిలో వాళ్ళ కు శుభ్రతే లేదు, బట్టలు చూడు ఎంత మురికిగా ఉన్నాయో చూడు అన్నారు. వెంటనే భార్య ఛ ఛ మన ఇంటిలో ఉన్న శుభ్రత ఏ ఇంటిలోని కూడా లేదు అని అన్నది భార్య. కొంత సమయానికి ఆ ఇంటి పనిమనిషి వచ్చి ఆ అద్దానికి ఉన్న మురికిని తుడిచింది. భార్యాభర్తలకు పెద్దఅవమానం అయిపోయింది. కారణం ఇప్పుడు వాళ్లకు వాళ్ళ కిటికీకి ఉన్న ధూళి కనిపించింది. పక్కింటి వాళ్ళ బట్టలు శుభ్రంగా ఉన్నాయ్.
పరిశుద్ధ బైబిల్ మత్తయి సువార్త7వ అధ్యాయంలో మొదటి 5వచనాలలో అద్భుతమైన కార్యాలు చదువుతున్నాం. మన కంటిలో గల దూలమును చూచుటకు యేసు మనకు భోదిస్తున్నారు. ఎప్పుడు మన వైపు ఉన్న తప్పును గ్రహించకుండ ఎలాగైనా ఇతరుల మీద మనతప్పును మోపాలి అన్నదే మనిషి యొక్క నైజం(వైఖరి). కాని ఇది పరిశుద్ధ బైబిల్ కు తగినది కాదు. మన యొద్ద దూలము వంటి పెద్ద లోపము ఉన్నప్పుడు దానిని లెక్క చేయకుండా ఇతరుల కాంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు ప్రయత్నించకూడదు. యేసు క్రీస్తు భోధించే కార్యాలు అన్ని కాలాలకు తగినవి మన అనుదిన జీవితానికి మిక్కిలి ప్రయోజనకరముగా ఉంటుంది. మన చేతుల్లో చూపుటువేలు ఎదుటివాళ్ళను చూపినప్పుడు మిగిలిన 3వేళ్ళు మనవైపు చూపిస్తున్నాయ్ అనేదాన్ని మర్చిపోకూడదు.
దీన్ని చదువుతున్న స్నేహితులారా! యేసుక్రీస్తు వలె పిలవబడియున్న మనము ఇతరులపై నేరం మోపకుండా ఉంటే బాగుండు కదా! బైబిల్ చెప్తున్న ఈ అనుదిన తర్ఫీదునకు మనల్ని సమర్పించు కుందాం. మన పక్కన ఉన్న పెద్ద పెద్ద తప్పిదాలను సరిచేసుకోనుటకు మొట్టమొదట ప్రయాసపడదాం. తరువాత ఇతరుల తప్పిదములను మార్చుటకు ప్రార్థిద్దాం. ఇలాగు మనము అనేకులకు మాదిరి క్రైస్తవులుగా అనగా వ్యక్తిగత జీవితంలో క్రీస్తుని కలిగిన వారుగా ఈ లోకానికి క్రీస్తుని చూపిద్దాం. మన జీవితం ద్వారా క్రీస్తు మహిమ పరచబడతారు.
- బ్రదర్. టి.శంకర్ రాజ్
ప్రార్థన అంశం:
లెంట్ కాల కూడికల్లో సహోదరుడు డేవిడ్ గణేషన్ గారిని దేవుడు బలముగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250