Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 02.03.2021

దిన ధ్యానము(Telugu) 02.03.2021

దేవుని యొక్క అవసరము.

"యేసు... వీరు భుజించుటకు ఎక్కడనుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను" - యోహాను 6: 5

గడిచిన 2020వ సంవత్సరంలో కరోనా వలన వచ్చిన ఆర్థిక ఇబ్బంది చెప్పలేనిది. దేశంలో గొప్ప ధన అవసరత ఏర్పడింది. ఒకరు తనకు తోచినంతగా ధన సహాయమును ప్రభుత్వమునకు పంపించారు. దేశము యొక్క ఈ అవరతను మధ్యప్రదేశ్ కు చెందిన ఇద్దరు చిన్నారులు గ్రహించారు. మిక్కిలి వెనకబడియున్న, మంచి వసతులు లేని గ్రామంలో జన్మించిన ఆ ఇద్దరు కూడా తమ హుండీలో సమకూర్చి పొదుపు చేసిన ధనమును లెక్కించకుండా ఉన్న ఆ ధనమును జిల్లా పోలీసు అధికారులకు సమర్పించారు. ఆ ధనమును భద్రంగా కేంద్రప్రభుత్వమునకు ఇచ్చారు ఆ పోలీస్ అధికారులు. దీనిని జిల్లా నిర్వాహకులు, పోలీస్ అధికారులు ఇలా అందరూ ఆ చిన్నారులను కొనియాడారు. 

ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు కాని ప్రజలకు ఆహారం పెట్టుటకు ఎక్కడ కొనాలి అని అడుగుతున్నారు అని యోహాను 6వ అధ్యాయంలో మనము చదువుతున్నాం. ఇదే దేవుని యొక్క అవసరత. దీనిని గమనించిన పేరు చెప్పబడని బాలుడు తన చేతుల్లో పట్టుకొనియున్న 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఎంత మాత్రము ఆలోచించకుండా తీసి ఇచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఆ రొట్టెలను, ఆ చేపలను వాడి ఇంచుమించు 5000 మంది పురుషులకు పంచి పెట్టారు. మిగిలిన రొట్టెలను వ్యర్థపరచ కూడదు వాటిని సమకూర్చి పెట్టండి అని ఆ బాలుడను ఘన పరచుటకు ఈ మాటలు చెప్పారు. మిగిలిన రొట్టెలు 12 గంపలు నిండా సేకరించారు. 

దీనిని చదువుతున్న స్నేహితులరా! ఈ దినములలో దేవుని యొక్క అవసరత ఏమి లేదు అని ఆలోచించకండి. ప్రభువైన యేసుక్రీస్తు కుడి, ఎడమ చేతుల యొక్క వ్యత్యాసం తెలియని ప్రజల యొక్క రక్షణ గురించి పరితపిస్తు ఉన్నారు. నేను సృష్టించిన నా ప్రజలు నన్ను ఎరుగకుండా ఎక్కడకో వెతున్నారే అని కన్నీరు కారుస్తున్నారు. ఈ లోక ప్రజల యొక్క రక్షణార్థమై ఈ ప్రజలు అర్హత కలవారిగా జీవించాలి అన్నదే ఆయన కోరిక. ఇవి అన్ని దేవుని యొక్క అవసరతై యున్నది. దీనిని నెరవేర్చుటకు మనం చిన్న పిల్లల వలె మన యొద్ద ఉన్న తలాంతులను, తెలివితేటలను, చదువును, ధనమును మనము కూడా ఇవ్వాలి. దేవుడు ఈ దేశమును, ఈ లోకమును దీవించాలి అని కోరుకుంటున్నారు. దీనిని గ్రహించిన వాళ్ళుగా నిష్కపటమైన వాళ్ళుగాను, చిన్న పిల్లల వలె మనలను మనము సమర్పిద్దాం, దేవుని యొక్క అవసరతను పూర్తిచేద్దాం. 
-    శ్రీమతి. శక్తి శంకర్ రాజన్

ప్రార్థన అంశం:-
ఈ దినము గెత్సేమనే క్యాంపస్ లో జరగబోతున్న విమోచన ఉపవాస కూడికలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా విడుదల పొందేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)