Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 01.03.2021

దిన ధ్యానము(Telugu) 01.03.2021

ప్రభువా కట్టండి. 

"పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చు కొనును" - 1కోరింథీయులకు 3: 14

ఒక నిర్మాణాన్ని నిర్మిస్తున్న ఒక ఇంజినీర్ ఒక కంపెనీలో  పనిచేస్తున్నారు. ఆయన యజమాని ఆ ఇంజినీర్ రిటైర్ అవ్వబోతున్న దానిని ముందే గ్రహించి ఒక కట్టడమును కట్టి ఇవ్వమని అడిగారు. మనము పని ముగించుకొని వెళ్ళబోతున్నాము కదా! కాబట్టి ఎలాగైనా కట్టి ఇస్తేచాలు జాగ్రత్త లేకుండా వస్తువులను కొని పని వాళ్ళను సరిగా గమనించ కుండా ఏదో కట్టాలి కాబట్టి బాధ్యత రహితంగా కట్టి ముగించారు. కట్టి ముగించిన వెంటనే దాని యజమానికి అప్పగించారు. వెంటనే ఆ యజమాని రిటైర్ అవ్వబోతున్న మీకే ఇది నాయొక్క బహుమానము అని చెప్పి ఆ తాళమును అతని చేతికి అప్పగించారు. దానిని విన్న ఆ ఇంజినీర్ దిక్బ్రాంతికి గురి అయ్యారు. ఈ ఇల్లు నాకే అని తెలిస్తే ఎంతో చక్కగా శ్రద్ధగా కట్టేవాడిని, శ్రేష్ఠమైన వస్తువులను వాడుకొని పనివారితో శ్రద్ధగా పనిచేయించి చక్కగా కట్టించే వాడిని అనుకొని చాలా బాధపడ్డాడు. 

ఇలాగే మనము ఈ లోకములో  మన కుటుంబములను కడుతున్నాము మనము ఎలాగు కడుతున్నాము అనే దాని గురించి ఆలోచించి చూచుటకు పిలవబడుతున్నాము. మన కట్టడపు యొక్క పునాది ప్రేమ. కుటుంబంలో బంధములను స్నేహముతో కట్టాలి. పనిచేస్తున్న స్థలములో బాధ్యతలు చేపడుతూ నిరీక్షణతో కట్టాలి అనేక సమయాల్లో మన కుటుంబ జీవితాన్ని ఏదో అనుకొని కడుతున్నాము. ఊరికినే తిని, ఊరికినే జీవిస్తూ విధి వస్తే చస్తాము అని జీవిస్తూ ఉంటే ప్రభువు మనలను చూసి దుఃఖపడతారు. కాబట్టి మనము జీవిస్తున్న జీవితం అర్ధవంతమైన జీవితంగా జీవించి ముగించాలి. ఒకే ఒక్క జీవితం అది త్వరగా గడిచిపోతుంది. క్రీస్తు కొరకు దేనిని చేసామో అదే ఆఖరి వరకు నిలబడుతుంది. మనము క్రీస్తు యొక్క అడుగుజాడలను వెంబడించే వాళ్ళుగా జీవించి మాదిరికరమైన జీవితం జీవిద్దాం.

1 కోరింధి 3వ ఆధ్యాయం 10 నుండి 12 వాక్య ప్రకారము మనము కడుతున్న కట్టడము బంగారము, వెండి, విలువ గలిగిన రాళ్లు, కర్రలు, గడ్డి  వీటితో కట్టవచ్చు. ప్రతి ఒక్కరి యొక్క కట్టడపు పని యొక్క కట్టడము ఒక దినము శోధించబడుతుంది. మీరు ఎలాగు మీ కుటుంబ జీవితం ఎలాగు కట్టబోతున్నామో అన్నదే ఇప్పుడే ఈ దినమే నిర్ణయించండి.
-    శ్రీమతి. జబా డేవిడ్ గణేషన్

ప్రార్థన అంశం:-
ఈ నెల అంతా జరగబోతున్న పరిచర్యలో దేవుని హస్తం తోడుగా ఉండి నడిపించులాగున ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)