దిన ధ్యానము(Telugu) 28.02.2021 (Kids Special)
దిన ధ్యానము(Telugu) 28.02.2021 (Kids Special)
నిజాయితీ హెచ్చింపును ఇస్తుంది.
"...నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను" - మత్తయి 25:21
హాలో ప్రియమైన పిల్లలు! పండ్లు అంటే మీకు ఇష్టమే కదా పండ్లు ఏయే కలర్లో ఉంటాయో చెప్పండి చూద్దాం. ఎరుపు రంగులో లో ఆపిల్ ఉంటుంది, పసుపు రంగులో మామిడి పండు ఉంటుంది, ఆరెంజ్ రంగులో ఆరెంజ్ పండు ఉంటుంది, పచ్చ రంగులో ద్రాక్ష పండు ఉంటుంది ఇలా అనేక రకములైన పండ్లను మీరు తిని చూసి ఉంటారు కదా అవి సూపర్ గా ఉంటాయి కదూ! పండ్లను చూస్తే ఎవరికి తినాలనిపించదు? అది కూడా తోటల్లో ఉండే పండ్లను తెంపి తింటే ఆ రుచియే వేరు. అంతే కదా!
ఒక దినము మాధవన్ ఆయన స్నేహితులు ఫుట్ బాల్ ఆడుకోవడానికి నడుచుకొని గ్రౌండ్ కి వచ్చారు. వాళ్ళు వచ్చే దారిలో మంచి మామిడి తోట ఒకటి వుండేది. గుత్తు గుత్తులుగా కాసే మామిడి కాయలను కాపు కాయడానికి తోట మాలి ఎప్పుడు ఉంటారు. అయితే ఏదో ఒకరోజు ఈ పండ్లు కొన్ని తెంపి తినాలి అని తలంచాడు మాధవన్. మాధవన్ తల్లికి ఆనారోగ్యంగా ఉండి పనికి వెళ్లలేక వంట చేయలేక ఉండిపోయారు. ఏమి చేయాలో తెలియక ఆకలితో నడుస్తున్నారు మాధవన్. ఆ మామిడి తోటను చూసేసరికి ఇంకా ఆకలి ఎక్కువ అయిపోయింది. ఆ దినము ఆ తోటలో ఎవరు కూడా లేనందున లోపలికి వెళ్లి మామిడి పండ్లను తెంపి తిని అమ్మకు కూడా కొన్ని పెట్టుకున్నాడు. హఠాత్తుగా ఆ తోట కాపలా దారుడు వచ్చి మాధవన్ ను పట్టుకొని దొంగ అని తిట్టి గట్టిగా కొట్టేసారు. మాధవన్ ఏడుస్తూ అయ్యా నాకు బాగా ఆకలి వేసింది అందుకే తిన్నాను మా అమ్మ పరిస్థితి కూడా బాగోలేదు అని చెప్పాడు. సరే నిన్ను నేను నమ్ముతున్నాను ఈ రెండు కేజీల మామిడి పండ్లను తీసుకొని వెళ్లి మార్కెట్ లో అమ్మివేసి రా అని చెప్పి అతనిని పరీక్షించాడు ఆ తోటమాలి. మాధవన్ మార్కెట్ కి వెళ్ళి వాటిని సరైన ధరకు వాటిని అమ్మి ఆ డబ్బులు తెచ్చి ఆ తోటమాలికి ఇచ్చాడు మాధవన్. తరువాత రోజు 10కేజీల మామిడి పండ్లను ఇచ్చి అమ్మి డబ్బులు తీసుకు రమ్మన్నాడు ఆ తోటమాలి ఆ రోజుకుడా మాధవన్ నిజాయితీగా ఉన్నాడు. తరువాత రోజు ఒక మూట మామిడి పండ్లను అమ్మమన్నారు. వాటిని కూడా అమ్మి డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చాడు మాధవన్. దీనిని చుసిన ఆ తోటమాలి నాకు పిల్లలు లేరు నిన్ను నా కొడుకు లాగా చూసుకుంటాను, నీకు అవసరమైన అన్నింటిని నేనే కొంటాను అని చెప్పిన వెంటనే మాధవన్ నమ్మలేకపోయాడు. ఆరోగ్యం బాగోలేక అమ్మ చనిపోయే పరిస్థితిలో మనో దుఃఖంలో ఉన్న మాధవన్ ఈ సంతోషకరమైన మాట వినగానే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. మాధవన్ నిజాయితీగా ఉన్నందు వలన అనేక మేలులు పొందుకొని అనేకులకు దీవెన కరముగాను, అశీర్వాదకరముగాను జీవించాడు.
హాలో పిల్లలు! మీ మాటలు, నడవడికను ఎవ్వరు చూడలేక పోవచ్చు కాని యేసయ్య నిన్ను చూస్తూనే ఉన్నారు అని ఆలోచనతో నిజాయితీగా ఉండిన యెడల మీ జీవితంలో ఆశీర్వాదం, హెచ్చింపు మిమ్మల్ని వెతుక్కొని వస్తుంది. నిజాయితీగా ఉంటారా?
- బ్రదర్. వై. అనిష్ రాజా
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250