దిన ధ్యానము(Telugu) 27.02.2021
దిన ధ్యానము(Telugu) 27.02.2021
అద్దెఇల్లు:
"పౌలు.... తన అద్దె యింట కాపురముండి” - అపో.కార్యములు 28: 30
ఏంటి ఇల్లు కట్టారా? ఇంకా పొలము రిజిస్ట్రేషన్ చేయ్యలేదా? ఏ కారు కొన్నారు? పిల్లల భవిష్యత్తు కొరకు బ్యాంకులో ఎంత డబ్బులు డిపోసిట్ చేశారు? కుమార్తె కొరకు ఎన్ని నగలు సమకూర్చారు? ఏంటి ఇవన్నీ అని ఆలోచిస్తున్నారు అవును ఈ దినపు ప్రజల యొక్క మాటలు. సొంత ఇల్లు, సొంత పొలము అని దీనిగురించి మాత్రమే చింతతో ఉన్నవాళ్లు అనేకులు. దీని కొరకు వాళ్ళు పడ్డ ప్రయాస కూడా చాలచాల ఎక్కువ. సొంత ఇల్లు కట్టుటలో తప్పు లేదు కాని కొందరికి ఇల్లు కట్టుటయే జీవితంలో ప్రాముఖ్యమైన గురిగా మారిపోతుంది. పేరు సంపాదించడం కోసం అప్పులు చేసి నెమ్మదిని కొల్పయిన వాళ్ళు అనేకులు కలరు. అలాగైతే ఇల్లు, బంగారము, కారు ఇవన్నీ పాపమా? లేదు కాని దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము అన్నదే ప్రశ్న.
బైబిల్లో అపోస్తులకార్యం 13 - 28 అధ్యాయం వరకు అపోస్తులుడైన పౌలు గురించి చదువుతున్నాం. ఆయన శిష్యులు అందరిలో ఎక్కువగా ప్రయాస పడినవాడు. దేవుని రాజ్యం కొరకు విశ్రాంతి లేకుండా ప్రయాస పడిన వ్యక్తి. ఆయన ప్రయాణం చేసిన దూరం చాలా ఎక్కువ. ఆయన దర్శించిన ప్రజలు అనేక మంది. ఆయనకు సహాయం చేసిన వాళ్ళు అనేకులు ఉన్నప్పటికీ పైన ఉన్న వాక్యం చదువుతున్నప్పుడు పౌలు సాదారణమైన జీవితం జీవించారు అని మనకు అర్థం అవుతుంది. అతనికొరకు ఒక సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా అద్దె ఇంటిలో ఉంటూ పరిచర్య చేస్తూ వచ్చారు. ఆయన ఆశ పడితే ఎన్నో అందమైన గృహములు కట్టుకొనేవాడు. ఎన్నో సుఖపరమైన కార్యములు చేసి ఉండవచ్చు. కాని పౌలు సాధారణ జీవితం జీవించి మనకు మాదిరి కరముగా జీవించి వెళ్లియున్నారు.
స్నేహితులారా! పౌలు చూడని ధనమా? ఆయనకు లేని బ్యాక్ గ్రౌండ్ ఆ ? ఇప్పుడు ఉంటున్న సేవకులు అందరి కంటే ఆస్తి గలిగినవాడిగా ఉండి ఉండవచ్చు. కాని అతనికి దేవుని రాజ్యమును గూర్చి మాత్రమే చింత. ఈ దినము మన ఆస్తులు, ధనము, బంగారము ధనము అనే వాటిగురించి వ్యర్థముగా ఆలోచించటమని ఒక సాధారణ జీవితమును జీవిద్దాం అపోస్తుల పుస్తకములో ఒక కధా నాయకుడి వలె జీవించారు. ఇది ఎంత ఉన్నతమైన పాఠము మనకు.
- బ్రదర్. టి. శంకర్ రాజన్
ప్రార్థనా అంశం:-
ప్రతి రాష్ట్రంలోను 500 మంది పార్ట్నర్ షిప్ మిషనరీలు దేవుడు లేపబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250