దిన ధ్యానము(Telugu) 26.02.2021
దిన ధ్యానము(Telugu) 26.02.2021
దేవుని చిత్తము:-
"ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు." - అపో. కార్యములు 5: 38,39
మహిమ అనే యవ్వనస్తురాలు తన యొక్క వివాహపు వయస్సు వచ్చేసరికి ఆమె ఇంటిలో తల్లిదండ్రులు ఆమెకు అనేకమైన సంబంధాలు (వరుడు కోసం) చూస్తున్నారు. బంధువులతో, తెలిసిన వారితో చెప్తూ ఉండే వారు. మహిమ యేసు క్రీస్తుని అంగీకరించుట వలన తన యొక్క భాగస్వామి కోసం ప్రార్థిస్తూ ఉండేది.అనేకమైన అవకాశాలు వస్తూ ఉన్నప్పటికీ ఏదోఒక కారణం చేత వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండేవి. ఈలాగూ జరుగుతూ ఉండుట చూచిన మహిమ నిరుత్సాహ పడింది. ఒక దినము దీనిని విన్న సహోదరి ఇచ్చిన సలహాప్రకారము మహిమ చేయడం ప్రారంభించింది. అది తనను ఉత్సాహ పరచింది. అదేమిటంటే ప్రార్థిస్తున్న ప్రతిసారి నా చిత్తము కాదు నా తల్లిదండ్రుల చిత్తము కాదు మీ చిత్తమే వివాహములో జరిగించండి అని ప్రార్ధించడం ప్రారంభించింది. ఇలా ప్రార్థిస్తూ ఉండగా ఇంకా కొంతమంది వచ్చి వెళ్తుండే వారు. అయినా కొన్నిదినాలలోనే తగిన వరుడిని దేవుడు, ఇచ్చినది కాక చక్కగా వివాహం జరుగుటకు కూడా దేవుడు సహాయం చేసారు. అది మహిమకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.,
అవును మన జీవితంలో కూడా అనేకమైన దీవెనలు పొందుకొనుటలో నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులలో ఇదా, అదా అని తికమక పడతాం., కొన్ని సమయాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిరుత్సాహ పడిపోతాం. ఎందుకు మనము కూడా మహిమ వలె ప్రార్ధించకూడదు? అన్ని పరిస్థితులలోనూ మేలైన, కీడైన దేవుని చిత్తాను సారంగా మన జీవితంలో అది జరిగితే అది మంచిదే ఈ దినములో కూడా ఏదోక విషయంలో కలత చెంది యున్నారా? దేవుని మీద భారం వేసి పైన చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుని యొక్క ఇష్టానికి ఆయన చిత్తానికి విడిచిపెట్టండి ఖచ్చితంగా మనుష్యుల చేత, లోకముచేత కార్యాలు జరిగితే అది, ముగించబడతాయ్. దేవుని వలన జరిగిన కార్యాలుఅయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా అది ఎంతమాత్రము ఆగిపోదు దేవుని పై ఆధారపడాలి ఆయనే కార్యం సఫలం చేయగలిగిన దేవుడు. యోసేపు జీవితంలో జరిగిన ప్రతి కార్యాలు కూడా వ్యతిరేకంగానే కనిపించింది. అయినప్పటికీ యోసేపు దేవుని వైపు చూస్తూ ఆయన చిత్తం కొరకు వేచియుండుట వలన దేవుని చిత్తం వైపు నడవడానికి సహాయం చేసింది. అలాగే ప్రభువు పైన ఆనుకొనండి ఆయనే మిమ్మల్ని నడిపిస్తారు, మిమ్మల్ని హెచ్చిస్తారు.
- సెలెక్టెడ్
ప్రార్థన అంశం:-
హీలింగ్ సర్వీస్ లో పాల్గొనే ప్రతి ఒక్కరు శరీరంలోను, ఆత్మ లోను స్వస్థపరచబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250