దిన ధ్యానము(Telugu) 25.02.2021
దిన ధ్యానము(Telugu) 25.02.2021
కీడులో మేలు:-
"అప్పుడు పౌలునీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను." - అపో.కార్యములు 16: 28
హెలెన్ తన స్కూటీ పై వెళ్తుంటే హఠాత్తుగా ఒక చిన్న అమ్మాయి పరిగెత్తుకొని అడ్డు వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న చెట్టుని గుద్ది హెలెన్ కింద పడిపోయింది. కళ్ళు తెరచి చూచి నప్పుడు బలమైన గాయములతో హాస్పిటల్ ల్లో ఉండుట చూచింది. 2వారాల తరువాత హెలెన్ ఇంటికి తీసుకువెల్లబడింది. ఆ దినము తన ఇంటి ముందు ఒక విలువ కలిగిన కారు ఒకటి వచ్చి నిలబడింది. దానిలో నుండి దిగిన వ్యక్తి హెలెన్ ని చూచి నీ యాక్సిడెంట్ కి గల కారణము మా పాపే అని చెప్పి నేను ఏదైనా మీకు సహాయం చేయాలా అని అడిగాడు అతను. కాని హెలెన్ నవ్విన ముఖముతో చూచి ఎలాంటి సహాయము వద్దు ఈ యాక్సిడెంట్ లో నేను మరణించినా కూడా నేను మోక్షానికి వెల్లియుంటాను అని ఎంతమాత్రమూ ఆలోచించకుండా చెప్పింది హెలెన్. అతను ఆలోచించి నేను ఒక ధనవంతుడను మరణాన్ని చూచి భయపడుతున్నాను నేను మోక్షానికి వెళ్లుటకు ఎంతకార్చుఅయినా పర్వాలేదు ఎంతకార్చుఅయిన పెట్టుటకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి నీవు దీనిని గురించి నాకు కొంచెం చెప్పవా అని అడిగారు. హెలెన్ తేటగా సువార్తను ప్రకటించింది. సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తి సహాయం పొందుకొని వెళ్లారు.
పౌలు,సీలను చెరసాలలో బంధకాలలో ఉంచినప్పుడు మధ్యరాత్రుళ్ళు దేవున్ని స్తుతించి పాడినప్పుడు సంకెళ్ళు తెగిపోయినయ్ చెరసాల అధిపతి పౌల్, సీల కూడా పారిపోయారని తలంచి తన్ను తాను చంపుకొనుటకు ప్రయత్నించాడు. అప్పుడు పౌలు ఆ చెరసాల అధిపతిని ఆపి వారిని ఉత్సాహ పరిచారు పౌలు యొక్క ఇలాంటి కార్యాము ఆ చెరసాల యొక్క కుటుంబాన్ని దేవునిలోనికి నడిపించాడు. పౌలు,సీల చెరసాల అనుభవాన్ని సంతోషంగా అనుభవించి యుండరు. ఇది వారియొక్క జీవితంలో జరిగిన కీడైన కార్యమే కాని ఆ వేదనలో ఉన్న సమయంలో కూడా ఒక మేలు జరిగింది.
ప్రియమైన వారలారా! మీ యొక్క జీవితంలో అడ్డు పడుతున్న సమస్యలను చూసి నిరుత్సాహ పడిపోకండి హెలెన్ వలె, పౌలు, సీల వలె మీరు కూడా మీ యొక్క కష్టం మధ్యలో కూడా దేవుని కొరకు సిద్ధ పరచుటకు దేవుడు ఎవరినైనా పంపిస్తారు.
- శ్రీమతి. మనసూయ పౌలు రాజ్
ప్రార్థన అంశం:-
పీస్ సెంటర్ ప్రారంభించుటకు పనులు త్వరగా జరుగుతూ వస్తున్నాయ్.దానికి అవసరమైన వ్యక్తులను తీసుకువచ్చి దేవుడు విమోచించేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250