దిన ధ్యానము(Telugu) 24.02.2021
దిన ధ్యానము(Telugu) 24.02.2021
పువ్వుతో కలిసిన తాడు.
"ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి" - అపో.కార్యములు 18: 26
నేను పాల్ టెక్నీక్ లో మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఫిజిక్స్ చెప్పడానికి వచ్చిన టీచర్ ను చూసి చాలా ఆశ్చర్యపడే వాడిని. ఆయన సమయాన్ని పాటించే విధానము, ఆయన ప్రేమ కలిగిన మాటలు, స్పష్టముగా అర్థం అయ్యే విధముగా పాఠములు చెప్పుట, దైర్యంగా మాట్లాడుట వీటన్నింటిని చూసి విద్యార్థులైన మేము చాలా నేర్చుకున్నాము అని చెప్పాలి. దాంట్లో ఉదయం అసంబ్లీ సమయంలో ఆయన యొక్క మాటలు కొరకు మేము ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన తన యొక్క గంభీరమైన స్వరముతో పరిశుద్ధ బైబిల్లో గల సామెతలు పుస్తకము నుండి అనేకమైన మాటలు చెప్తూవుంటారు. ఆ మాటలు నన్ను మాత్రమే కాదు అనేక మైన విద్యార్థులను తాకింది. ఆయన క్లాస్ అంటే మాకు చాలా ఆశక్తి వచ్చేది. ఆయనతో ప్రయాణము చేసిన ఆ సంవత్సరం అంత నేను మరియు తోటి విద్యార్థులు చాలా క్రమమును నేర్చుకున్నాం. ఖచ్చితమైన జీవితం జీవించాలి అని నిర్ణయించుకున్న వాళ్ళు అనేకులు. శ్రేష్ఠమైన జీవితం జీవించాలి అని నిర్ణయం తీసుకున్న వాళ్ళు అనేకులు.
పరిశుద్ధ బైబిల్లో అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో దేవుని దాసుడైన పౌలు కోరింథి పట్టణమునకు వస్తున్నారు. అక్కడ ఇటాలి నుండి వచ్చిన అకుల ఆయన భార్య ప్రిస్కిల్ల కనబడుతున్నారు. పౌలు వారియొద్ద ఉండి పనిచేస్తూ వస్తున్నారు. వీళ్ళు సాదారణమైన గుడారం తయారుచేసే పని చేసేవాళ్ళు అంతే. కాని చూడండి పౌలు వారితో బస చేసిన దినాలు వాళ్ళకు ప్రయోజన కరముగా ఉండేవి. పౌలు యొక్క పౌరుషము, యూదులతో చేసిన సంభాషణలు, పౌలు యొక్క దర్శనము దేవుని కొరకు ఆయన తిరిగిన ప్రయాస ఇవి అన్ని కూడా అకుల, ప్రిస్కిల్ల ను ఆకర్షిచింది. పౌలు వాళ్ళతో ఉండిన దినాలు వాళ్ళను ఉజ్జీవింప చేసింది. అప్పటివరకు సాదరంగా ఉండిన ఈ దంపతులు తరువాత అపోల్లో అనే బైబిల్ టీచర్ కే దేవుని యొక్క వాక్యమును వివరించి చూపించే వాళ్లుగా అర్హత సంపాదించారు. పౌలు వలన ఈ దంపతులకు దేవుని వాక్యమును నేర్చుకోగలిగారు.
దీనిని చదువుతున్న స్నేహితులారా! మనము ఉండి చదువుతున్న, పనిచేస్తున్న, పరిచర్య చేస్తున్న స్థలములలో పౌలు వలె అనేకులను తయారుచేస్తున్నామా? మన జీవితం అనేకులకు మాదిరి కరముగా ఉంటుందా? మనతో ఐక్యపర్చ బడుతున్న వ్యక్తులు భక్తిలో వృద్ధి చెందుతున్నారా? వాళ్ళను యేసు క్రీస్తు శిష్యులుగా చేస్తున్నామా? పువ్వుతో కలిసి ఉన్న తాడుకూడా పరిమళం చెందుతుంది అని చెబుతారుగా మరి మనతో ఉన్న వాళ్ళు అటువంటి అనుభవం చెందుతున్నారా?
- బ్రదర్. టి. శంకర్ రాజాన్
ప్రార్థన అంశం:-
మీడియా పరిచర్యలో ఆడియో రికాడింగ్ కొరకు మైక్ అవరమై ఉన్నది దేవుడు దయచేయులాగున ప్రార్ధించండి.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250