Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 22.02.2021

దిన ధ్యానము(Telugu) 22.02.2021

మోకాళ్లలో బలము.

"పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి…" - అపో.కార్యములు 9:40

బౌద్ధ మార్గమునకు చెందిన 19 సంవత్సరాలు నిండిన యవ్వనస్తుడు ఒకరు క్షయ రోగముతో బాధపడ్డారు. వైద్యుల చేత విడవబడిన వాడిగా ఒంటరిగా నిరీక్షణ లేనివాడిగా మతిస్థిమితం లేనివాడిగా రోజురోజుకి వాడి పరిస్థితి దిగజారిపోతు తన జీవితపు ఆఖరి దినములను లెక్కిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో స్కూల్లో చదువుతున్న ఒక చిన్న అమ్మాయి అతని యొద్దకు వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్పి ఒక కొత్తనిబంధన అతనికి ఇచ్చింది. కాని ఆ యవ్వనస్తుడైతే దానిని అంగీకరించలేదు మారుగా ఇది అతనికి బుద్ది హీనతగా అనిపించింది. ఆ చిన్నది తరువాత దినాల్లో మరలా మరలా యేసుక్రీస్తు గురించి అతనికి ప్రకటిస్తూ వచ్చింది. ఆ నూతన నిబంధనను విసిరివేసి ఆమెను తిట్టి పంపించాడు. అయితే ఆ చిన్నది ఎంత మాత్రం నిరుత్సాహ పడకుండా అతని కొరకు మోకరించి ప్రార్ధించింది. ఆలాగు ఆమె మోకరించి ప్రార్ధించినప్పుడు ఆమె కంట్లో నుండి కన్నీళ్లు వస్తువుండేవి. దానిని చూసిన ఆ యవ్వనస్తుడు  యేసుక్రీస్తు ప్రేమను గ్రహించి ఆశ్చర్య రీతిలో స్వస్థత పొందుకున్నాడు. అతను ఈ దినము వరకు ప్రభువు పరిచర్య చేస్తున్నారు. అతనే దక్షిణ కొరియాలో దేవుని చేత వాడబడుతున్న బోధకుడు పాల్ యాంగిచో. 

పరిశుద్ద బైబిల్లో కూడా యొప్ప పట్టణస్తురాలు దోర్క అనే సహాయం చేస్తున్న శిష్యురాలు ఉండేది. ఆమె అనేక సత్క్రియలు చేస్తూ వచ్చింది. ఒక దినము ఆమె రోగము వలన మరణము చెందారు. అప్పుడు పేతురు అందరిని బయటకు పంపించి ఆమె యొద్ద మోకరించి ప్రార్ధించారు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆమెను ప్రాణముతో లేపారు. 

దీనిని చదువుతున్న ప్రియ స్నేహితులరా! మీ యొక్క మోకాళ్ళ ప్రార్థన మిక్కిలి బలమైనది మరియు మిక్కిలి విలువకలిగినది. మరణ పడకమీద ఉన్న పాల్ యాంగిచో జీవితమునకు ఒక చిన్న అమ్మాయి మోకాళ్ళ ప్రార్థన ప్రాణం  పొందేటట్లు చేసింది. అవును ధనము చేత, వైద్యులు చేత చేయలేని కార్యమును మోకాళ్ళ ప్రార్థన చేయగలదు. ఈ దినము మీరు చనిపోతున్న పరిస్థితి కొరకు కన్నీరు కారుస్తున్నారా?  మీ యొక్క నిరీక్షణ మరణించినట్లు కనిపిస్తుందా? అయితే ఈ రోజే మీ మోకాళ్ళను యేసయ్య యొద్ద వంచండి. ప్రయత్నించి ఓడిపోయిన మీరు మోకాళ్ళ ప్రార్ధనలో విజయము పొందండి. మీకు ప్రియమైన వాళ్ళను హాస్పిటల్ లో పెట్టి ఏమి జరగబోతుందో అని కలతతో ఉన్నారా? మోకాళ్ళ పై దేవునితో పోరాడండి మీ కన్నీటిని ఆయుధంగా వాడుకోండి. అద్భుతం నిశ్చయంగా జరుగుతుంది.
-    శ్రీమతి. శక్తి శంకర్ రాజన్.

ప్రార్థన అంశం:-
లెంట్ కాల కూడికల్లో బ్రదర్ డేవిడ్ గణేషన్ గారిని ప్రభువు బలముగా వాడుకొనేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)