దిన ధ్యానము(Telugu) 21.02.2021 (Kids Special)
దిన ధ్యానము(Telugu) 21.02.2021 (Kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లలకు.
క్షమించుము.
"మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును" - మత్తయి 6: 14
నిషా నిషా అని కేకవేస్తూ పరిగెత్తుకొని వచ్చింది ఆమె ఫ్రెండ్ త్రిష. వీళ్లిద్దరూ ఏడవ తరగతి చదువుతున్న మంచి స్నేహితురాళ్లు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుంటారు. నిషాకి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఏదైనా పువ్వుల స్టిక్కర్ లేదా క్యాలెండర్ ఉంటే తీసి జాగ్రత్తగా దాచుకొనేది.
ఒక రోజు వీళ్ళు చదువుతున్న క్లాస్ రూమ్ లో ఒక పాత క్యాలెండర్ ఒకటి ఉన్నది దానిని తీసి చూస్తే 12 నెలలో కూడా పువ్వుల బొమ్మలు కనిపించాయి. దానిని చూసిన నిషాకి చాలా ఆనందం. ఎవ్వరికి చెప్పకుండా దానిని తీసి బ్యాగ్ లో పెట్టేసుకుంది. మరుసటి దినము ఉదయమున తన క్లాస్ టీచర్ ఆ పాత క్యాలెండర్ లో ఏదో ప్రాముఖ్యమైన కార్యం రాసిపెట్టినందు వలన దానిని వెతకడం ప్రారంబించారు. ఆ టీచర్ ఎవరు ఆ క్యాలండర్ తీశారు అని విద్యార్థులు అందరిని అడిగారు. ఆ సమయమే నిషా కూడా క్లాస్ రూమ్ లోనికి వచ్చింది. టీచర్ నిషాను చూసి నిషా నువ్వే ఆ క్యాలండర్ తీసావా అని తిట్టివేశారు. నిషా ప్రశాంతంగా సారీ టీచర్ దాంట్లో పువ్వుల బొమ్మలు ఉన్నాయి కాబట్టి నేను తీసాను ఈ సారి మరి తియ్యను నన్ను క్షమించండి. ఇక మీదట అలాంటి తప్పును చెయ్యనే చేయను అని చెప్పి ఏడ్చింది. కాని ఆ టీచర్ ఆమెను క్షమించకుండ ఒక అట్ట ముక్కను తిసుకొని దానిపై నేను ఒక దొంగ అని వ్రాసి నిషా మెడలో వేశారు. ప్రతి క్లాస్ రూమ్ కి ఆమెను తీసుకొని వెళ్ళి చూపించారు. ఇతర విద్యార్థులు ఆమెను చూసి నవ్వుడం వలన నిషా తట్టుకోలేకపోయింది. హృదయం పగిలింది. సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంటనే నిషా ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని తనకు జరిగిన అవమానమును తలంచుకొని ఏడుస్తూ ఉండిపోయింది. తరువాత ఆమె చదువును కొనసాగించ లేదు. ఆ తప్పిదమును టీచర్ క్షమించ లేదు కాబట్టి ఒక మంచి విద్యార్థిని యొక్క భవిష్యత్తు పాడైపోయింది.
ప్రియమైన తమ్ముడు, చెల్లి ఆ టీచర్ ఆమెను క్షమించి ఉంటే ఎంత బాగుండును నీవు కూడా ఎవరిని క్షమించ కుండ ఉండకు. నీకు లేదా నీ కుటుంబానికి విరోధముగా లేచిన వారు మనస్సు మారి క్షమాపణ అడుగుటకు మీ దగ్గరకు వచ్చినప్పుడు మంచి మనస్సుతో క్షమించడానికి సిద్ధపడండి అప్పుడే యేసయ్య మీరు చేసిన తప్పిదములను క్షమిస్తారు.
- శ్రీమతి. సారాల్ శుభాష్
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250