Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 20.02.2021

దిన ధ్యానము(Telugu) 20.02.2021

మనో బలమా బుద్ధిబలమా?

"పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు బలము పొందేదరు" - అపోస్తులకార్యములు 1: 8

ఒక పెన్ను నాకు అన్నీ తెలుసు నేను అన్నింటిని సూపర్ గా జ్ఞానముతో వ్రాయగలను అని మాట్లాడితే ఎలా ఉంటుంది? బాగా నవ్వు వస్తుంది కదూ! అదే రాసే వాడి చేతుల్లో తన్ను తాను సమర్పించు కొనిన యెడల అనేకులకు దీవెన కరముగా మారగలదు. అలాగే మనము కూడా ఒంటరిగా ఉండి నిలబడి ఏమి చేయలేమ్ అనేదాన్ని గ్రహించి పరిశుద్దాత్ముని యొక్క  పాలన కింద ఉండేటప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేయగలరు. 

ఈ కోణములో యేసుక్రీస్తు శిష్యుడైన పేతురు జీవితాన్ని ధ్యానిద్దాం. పెన్ను వలె పేతురు కూడా యేసు యొద్ద ఎవ్వరూ మిమ్మల్ని విడిచివెళ్ళినా కూడా నేను మిమ్మల్ని విడిచి వెళ్ళను నేను మిమ్మల్ని తిరస్కరించను అన్నట్లు మాట్లాడారు. వీటన్నింటిని చూచి దూతలు బాగా నవ్వి యుంటారు. యేసు నీవు నన్ను ముమ్మారు తిరస్కరిస్తావ్ అని చెప్పినప్పటికీ ఆయన దానిని అంగీకరించలేకపోయాడు ఫలితం యేసు తెలియదు అని ఒట్టుపెట్టుకొనుట మొదలు పెట్టెను అని వ్రాయబడి ఉంది. ఆయన యొక్క మనోబలము ఏమి లేకుండా పోయింది. కానీ ఎప్పుడు పరిశుద్దాత్ముడు పొందుకొని పరిశుద్దాత్ముని కింద తన పరిపాలనను సమర్పించుకున్నాడో ఆ దినం మొదలుకొని ఆయన నూతన బలం పొందుకున్నాడు. ఏ జనం యెదుట యేసుక్రీస్తుని తిరస్కరించాడో అదే జనాంగం మధ్యలో యేసుక్రీస్తు గురించి చెప్పే సాక్షిగా నిలబడ్డాడు. తన ప్రాణాన్ని కాపాడుకొనుటకు ఎవరు ముందు వెనుకంజ వేశారో అదే యూదుల యెదుట తన ప్రాణాన్ని లెక్కచేయకుండ మాట్లాడారు. వీటన్నింటినీ తన స్వంత బలముతో పేతురు చేసారా? కాదే పరిశుద్దాత్ముని యొక్క బలమే కారణం.

నా ప్రియ సహోదర, సహోదరీల్లారా! నేను దీన్ని చేయగలను, నేనే దీన్ని చేస్తాను అని మీ స్వంత బలము వలన ప్రయత్నించి ఓడిపోయినది చాలు, మన చేతుల్లో ఉన్న చిన్న పెన్ను సంపూర్ణంగా తన్ను సమర్పించుకున్నట్లు, ఇతరులకు ఆ పెన్ను ఎలా ప్రయోజనకరంగా ఉంటుందో అలాగే మనము మన జీవితాన్ని పరిశుద్దాత్ముని యొక్క నడిపింపులోనికి ఉపయోగించినప్పుడు ఉన్నత బలము మనల్ని కప్పుతుంది ఆ బలముతో మనము క్రీస్తు నామాన్ని ప్రకటించి క్రీస్తుకు సాక్షులముగా ఖచ్చితంగా జీవించగలం. 
-    శ్రీమతి. జెస్సి అలెక్స్

ప్రార్థన అంశం:-
మోక్ష ప్రయాణము, దిన ధ్యానము ముద్రించుటకు కావలసిన అవసరతలు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)