దిన ధ్యానము(Telugu) 19.02.2021
దిన ధ్యానము(Telugu) 19.02.2021
ఎందుకు హింసిస్తున్నావు ?
"సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావు" - అపో.కార్యములు 9: 4
ఒక గ్రామంలో దేవుడు లేడు అని చెబుతున్న నాస్తికుడు ఒకాయన ఉండేవారు. ఆయన క్రైస్తవుల గురించి తప్పిదముగాను, వాళ్ళ కార్యముల గురించి ఘనహీన పరిచే విధముగాను మాట్లాడుతూ వచ్చారు. ఈ పరిస్థితిలో ఆయన హఠాత్తుగా ఒకదినము పక్షవాతం వలన అతని చేతులు, కాళ్ళు పనిచేయకుండా పోయాయి. తన పరిస్థితిని గ్రహించి వేదన చెందారు. తాను మునుపటి వలె లేచి నడవలేకపోతున్నానే అని బాధపడ్డాడు. వైద్యం కోసం ధనము అంత ఖర్చు పెట్టిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక మీయొక్క ప్రయత్నమే అని వైద్యులు చెప్పేసారు. అప్పుడు ఒక దేవుని సేవకుడు అతని యొద్దకు వెళ్ళి దేవుని కొరకు అతనికి చెప్పి ప్రార్ధించారు. తన పరిస్థితిని బట్టి ఆయన దేవున్ని అంగీకరించారు. నేను క్రీస్తుకు వ్యతిరేకంగా కార్యములు చేసాను అని గ్రహించి పశ్చాతాప పడి తనను సంపూర్ణంగా సమర్పించు కున్నారు. ఆయన యొక్క బలహినతలు నెమ్మదిగా తగ్గిపోవడం ప్రారంబమయ్యాయి. సంపూర్ణ ఆరోగ్యం పొందుకొని దేవున్ని మహిమ పరచడం ప్రారంభించారు.
బైబిల్లో కూడా సౌలు అనే యవ్వనస్తుడు ఇంటింటికి వెళ్ళి క్రైస్తవులను ఈడ్చుకొనిపోయి చెరసాలలో వేసేవాడు. ఈడ్చుకొనిపోయి అంటే వాళ్ళను బలవంతంగా తీసుకొని వెళ్ళాడు అని చూస్తున్నాం. ఇలా ఒక్క ప్రాంతంలో మాత్రమే కాదు తన దేశం అంతా కూడా ఇలాగ క్రైస్తవులను చెరసాలలో వేయుటకు అధికారుల యొద్ద అనుమతి పొందుకొని దమస్కు వెళ్తున్న దారిలో దేవుడు సౌలును దర్శించారు. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నారు. అందుకు సౌలు ప్రభువా నివెవరు అని అడిగాడు. అందుకు ప్రభువు నీవు హింసిస్తున్న యేసు నేనె అన్నారు. వెంటనే ఆయన నేల మీద పడి వణికి తనను ప్రభువునకు సమర్పించుకున్నారు. అననియా ద్వారా తనకు తాను చేయవలసిన కార్యములను గ్రహించి వెంటనే సంఘంలో చేరి క్రీస్తు ప్రేమను, తాను క్రీస్తుని ఎరిగిన విధానమును ప్రకటించాడు.
అవును ప్రియమైన వారలారా! దేవుని చేత సృష్టించబడిన ఎవ్వరినైనా మనము కష్టపెట్టిన యెడల అది దేవున్ని హింసించుట వలె సమానము. కాబట్టి ఎవ్వరిని కూడా ఘనహీనముగా ఆలోచించి చేతలతో గాయపరచకండి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళను, మీ క్రింద పనిచేస్తున్న మీ స్నేహితులను లేదా మీ బంధువులను ఏదో ఒక సమయంలో హింసించి యున్నారా? అయితే మీరు వాళ్ళను కాదు వాళ్ళను సృష్టించిన దేవున్నే సృష్టించి యున్నారు అనే దాన్ని మర్చిపోకండి. అయినప్పటికీ ప్రేమ గల దేవుడు తనను హింసిచిన సౌలును అనగా పైన ఉన్న నాస్తికుని ప్రేమించి వెదకి వచ్చినట్లు మీ కొరకు ఆయన ఎదురుచూస్తున్నారు. మీ యొక్క తప్పిదములను ఆయన యొద్ద సమర్పించి దేవునితో సమాధానపడి దేవుని శక్తితో వాళ్ళను ప్రేమించండి, అనేకులకు దీవెన కరముగా జీవించండి.
- బ్రదర్. సి.పాల్ జాబస్టీన్
ప్రార్థన అంశం:-
మోక్ష పయనం అనే దిన ధ్యానము సిద్ధపరుస్తున్న ప్రతి సేవకులకు దేవుని జ్ఞానం బయలు పరచబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250