దిన ధ్యానము(Telugu) 18.02.2021
దిన ధ్యానము(Telugu) 18.02.2021
ఏక మనస్సు.
"...అందరు ఒకచోట కూడియుండిరి" - అపో.కార్యములు 2: 1
ఒక గ్రామంలో గల చర్చ్ లో యవ్వనస్తులు ఎవ్వరు కూడా ఆరాధనకు రాని కష్టమైన పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితిలో ఒకే ఒక యవ్వనస్తుని ప్రభువు రక్షించారు. ఆయనను మిగతా యవనస్తులు అందరూ కరోనా క్రిమిని చూసినట్లే చూసేవారు, దగ్గరకు కూడా వచ్చేవారు కాదు. తరువాత మరియొక యవ్వనస్తుడు కూడా రక్షించబడ్డాడు. తరువాత ఇద్దరు కూడా కలిసి అనుదినము కొంత సమయాన్ని కేటాయించి ప్రార్ధించే వారు. రోజులు గడుస్తున్న కొలది వాళ్లకు తెలియకుండానే మిగిలిన యవ్వనస్తులను గూర్చిన భారం వాళ్లకు ఏర్పడినందున ఇద్దరు ఏక మనస్సు కలిగి కన్నీటితో ప్రార్ధించారు. పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయడం ప్రారంభించారు. తరువాత అనేక మంది యవ్వనస్తులు రక్షించబడ్డారు. సంఘంలో గొప్ప ఉజ్జీవం ఏర్పడింది. సండే స్కూల్ నడిపించడానికి మరియు సువార్త పరిచర్య చేయడానికి యవ్వనస్తులు ముందుకు వచ్చారు. అనేక సంవత్సరాలు కనబడని మార్పు రావడానికి ఆ ఇద్దరు యవ్వనస్తులు కలిసి చేసిన ప్రార్ధనే అనే దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదు.
అపోస్తుల కార్యములో ఇంచు మించు 10 సార్లు ఏకమనస్సు అనే మాటను పరిశుద్ధాత్ముడు రాసి పెట్టియున్నారు. దాంట్లో 6సార్లు మంచి కార్యం కొరకు 4సార్లు కీడైన కార్యం కొరకు ఏక మనస్సు కలిగి ఉండాలి అని మనం చదువుతున్నాం. ఎప్పుడైతే అపోస్తులలు దేవుని నామ మహిమర్థమై ఏక మనస్సు కలిగి ఉన్నారో అప్పుడు ప్రార్థన అధికం అయింది. బలముగా ఆత్మీయ వరములు ప్రత్యక్షమై పరిచర్యకు మనుష్యులు పంపించబడ్డారు. ఈ విధముగా పరిశుద్ధాత్ము క్రియ చేయడం ప్రారంభించారు. గొప్ప ఉజ్జివం ప్రారంభమైనది. కీడైన కార్యములు కొరకు ప్రజలు ఏకమైనప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డారు. అననియా, సప్పిరా ఏక మనస్సు కలిగి పొలము విషయంలో పరిశుద్దత్మ దేవుని ఎదుట అబద్దం ఆడి అతనిని దుఃఖపరిచారు. యూదులు ఏక మనస్సు కలిగి స్టెఫను పై రాళ్ళు రువ్వినప్పుడు అతను పరిశుద్ధాత్మ చేత నింపబడి అతను పలికిన మాటలు యూదులు వినకుండుట చూచి పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డారు.
దీనిని చదువుతున్న మీతో కూడా పరిశుద్ధాత్ము మాట్లాడుతున్నారు. మీరు ఎవరితో, దేని కొరకు ఏక మనస్సు కలిగి ఉన్నారు. మీరు ఏక మనస్సు కలిగి చేస్తున్న కార్యం పరిశుద్దత్ముని బలముగా పని చేయుటకు దారితీస్తుందా? లేదా ఆయనను దుఃఖ పరిస్తుందా? అననియా దంపతుల వలె గౌరవము కొరకు లేదా పేరు ప్రఖ్యాతులు కొరకు, స్వార్థం కొరకు ఏక మనస్సు కలిగి ఉంటే మీకు కూడా వాళ్ళకు జరిగిన పతిస్థితే జరుగుతుంది ఎంత దుఃఖం. మారుగా దేవుని కొరకు పని చేయుటకు, ఇచ్చుటకు, సేవకులను పంపించుటకు ఏక మనస్సు కలిగి ఉండిన యెడల భారతదేశం అంతటి ఉజ్జీవం కొరకు పరలోకంలో వ్రాయబడుతుంది. అంటే దాంట్లో మీ పేరు కూడా బంగారపు అక్షరములతో వ్రాయబడుతుంది అన్న దాంట్లో ఎంత మాత్రము సందేహం లేదు. కాబట్టి ఏక మనస్సు కలిగి ఉండండి, విభేదములు మానండి, లోకమునకు వెలుగునివ్వండి.
- బ్రదర్. గాంధీ రాజన్
ప్రార్థన అంశం:-
మిషనరీలను సపోర్ట్ చేస్తున్న కుటుంబాలు లేచేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250