Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 16.02.2021

దిన ధ్యానము(Telugu) 16.02.2021

ఆత్మీయ పౌరుషం 

"పౌలు... అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను” - అపో 17:16

ఇంగ్లండ్ దేశములో చాలా పేదరిక కుడుంబములో  జన్మించిన వ్యక్తి విలియం కెరీ. పేదరికం వలన బడి చదువును సగంలోనే నిలిపి వేశారు. ఈయన యొక్క 16వ సంవత్సరంలో చెప్పులు కుట్టే షాప్ లో పని చేస్తూ తన బల్ల ముందు వేలాడుతున్న భారత దేశపు మ్యాప్ ను చూసి యేసుక్రీస్తు ను ఎరుగని ప్రజల కొరకు మిక్కిలి భారముతో, కన్నీటితో ప్రార్ధించి వచ్చేవారు. 1793వ సంవత్సరం భారత దేశమునకు వచ్చి వెస్ట్ బెంగాల్లో తన పరిచర్యను ప్రారంభించారు. అక్కడకు వచ్చిన కొన్ని రోజులకే తన 5 సంవత్సరాల కుమారుడు మరణించాడు. అది చూచిన ఈయన భార్య మతి స్థిమ్మితం లేని విధముగా మారిపోయారు. ఈయన కూడా మలేరియా జ్వరము వలన మరణపు అంచుల వరకు వెళ్లిపోయారు. అయినప్పటికీ దేవుని కొరకు పౌరుషముగా నిలబడి శ్రమలను సహించారు. ఒక రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో తాను ఎంతగానో ప్రయాసపడి చేసిన బైబిల్ తర్జుమా పుస్తకములు అన్నీ కూడా ఆ అగ్నిలో కాలి బూడిద అయిపోయాయి. పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన దేవుని కొరకు ముందు పెట్టిన అడుగు వెనకకు తీయలేదు. వెస్ట్ బెంగాల్ సిరంపూర్ యూనివర్సిటీ అనే గొప్ప బైబిల్ కళాశాలను ప్రారంభించారు. ఈ దినము ఆ బైబిల్ కళాశాల నుండి అనేక మంది దేవుని సేవకులు తయారు అయ్యి లోకమంతా కూడా పరిచర్య చేస్తూ ఉన్నారు. 

బైబిల్లో యేసుక్రీస్తు తరువాత అనేక మైన శ్రమలు పొందిన వ్యక్తి అపోస్తులుడైన పౌలు. ఆకలి, దెబ్బలు, చెరసాల అని ఈయన యొక్క శ్రమలు అనేకము. చెరసాలలో ఉండినప్పటికి అనేక మంది యవ్వన సేవకులను తయారు చేశారు అని అనేక పత్రికలు రాసారు. కారణము పొందుకున్న పరిచర్యను నెరవేర్చాలి అనే పౌరుషమే మరియు ఆయన ఆత్మలో మిక్కిలి పౌరుషము కలిగి రోజు ధైర్యముతో ప్రసంగించే వారు. దాని వలన ఆ దినాల్లో గొప్ప ఉజ్జీవం ఏర్పడింది. 

దీనిని చదువుతున్న మనలో ఎలాంటి పౌరుషము ఉంది. దేవుని కొరకు పౌరుషమా? లేదా శరీరానుసారమైన పౌరుషమా? దేవుని కొరకైన పౌరుషము మనలను గొప్ప ఆత్మల సంపాదకులుగా మార్చుతుంది. కాని మన సహోదరునితో మాట్లాడకుండా ఉండే పౌరుషము, పగ, కోపము ఇలాంటి కార్యములను పౌరుషముగా పెట్టుకుంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసుకుంటాం. ప్రభువు మనతో మాట్లాడుతున్నారు. క్రైస్తవ జీవితము ప్రారంభంలో దేవుని కొరకు పౌరుషముగా నిలబడ్డారో దినములు గడుస్తున్న కొలది అవి కనుమరుగైపోయి శ్రమలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తున్నాయా. పైన చూసిన ఇద్దరు దేవుని దాసుల జీవితాన్ని చూడండి. తమను ఏర్పరుచుకున్న దేవుని కొరకు సమస్తాన్ని సహించి పౌరుషముతో జీవించుట వలన వాళ్ళు శిష్యులను, సేవకులను తయారుచేస్తు ఉన్నారు. అలాగైతే మనము కూడా దేవుని కొరకు ధైర్యముగా నిలబడుతున్నప్పుడు ఫలితం లేకుండా పోతుందా కచ్చితంగా ఫలితం కలదు. 
-    శ్రీమతి. శక్తి శంకర్ రాజన్

ప్రార్థన అంశం:
చిన్న పిల్లల సపోర్టర్స్ ప్రణాళికలో కలిసియున్న పిల్లల తల్లిదండ్రులు తమ సమర్పణలో నిలిచి యుండి పిల్లల కొరకు ప్రార్ధించేటట్లు  ప్రార్థిద్దం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)