దిన ధ్యానము(Telugu) 15.02.2021
దిన ధ్యానము(Telugu) 15.02.2021
సీటు ని పేరులో?
"...మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను" - అపో.కా 1: 26
ఇంటర్నేషనల్ భారత క్రికెట్ టీమ్ లో ఒక ఆటగాడిగా చోటు దక్కించు కొనుట అంత సులువు కాదు. ఆయనను ప్రస్తుతం అందరం ఆశతో చూస్తున్న టి20 అనే ఇంటర్నేషనల్ భారత దేశపు జట్టులో చోటు దక్కించుకోవాలి అంటే ఇంకా కఠినమే. 2020 అక్టోబర్ 26 తారీఖు ఇంటర్నేషన్ క్రికెట్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రయాణంలో 15 మంది గల జట్టులో నటరాజన్ అనే తమిళనాడుకు చెందిన ఆటగాడు కూడా ఎంపిక చేయబడ్డాడు. అదే సంవత్సరం నవంబర్ 4వ తారీఖు జరిగిన రెండవ టి20 ఆటలో ప్రాముఖ్యమైన ఆటగాడికి గాయం ఏర్పడుటవలన నటరాజన్ కు అవకాశం దొరికింది. చాలా కష్టమైన కుటుంబం నుండి వచ్చిన ఈయనకు ఎలాంటి రికమెండేషన్ లేదు. మొదటి మ్యాచ్ లోనే ప్రముఖ్యమైన 3 వికెట్లు తీసుకొని దేశమునకు విజయము రావడానికి సహాయపడ్డాడు. సిరీస్ గెలుచుకొని కప్ అందుకున్న భారత కెప్టెన్ ఆ కప్పును నటరాజన్ కు ఇచ్చి సంతోషించారు. మరియొక ఆటగాడు హార్దిక్ పాండ్య కూడా అలానే చేశారు. దీని ద్వారా నటరాజన్ తల్లిదండ్రులకు, ఊరికి మరియు తమిళనాడుకు కూడా గర్వపడే విధంగా చేసాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టి20 క్రికెట్ టీమ్ లో నటరాజన్ ఒక స్థిరమైన అటాగాడిగా ఉండిపోయాడు.
పరిశుద్ధ బైబిల్లో కూడా అపోస్తులకార్యం 1వ అధ్యాయంలో చూసినప్పుడు యేసుక్రీస్తు 12 శిష్యులలో ఒకరైన ఇస్కరియోతు యూదా ధన ఆశ వలన సాతానుకు తన జీవితంలో చోటు ఇచ్చి యేసయ్యను అప్పగించి తరువాత ఉరి వేసుకున్నాడు అని చూస్తున్నాం. ఆయన విడిచి పెట్టిన స్థలంలో మరియొక శిష్యుడును ఏర్పరుచుకోవడానికి శిష్యులు సిద్ధపడ్డారు. అప్పుడు చీటు మత్తయి పేరుమీద పడింది (అపోస్తూ1:26). ఇది మత్తయి కి దొరికిన ఘనత అనవచ్చు. మత్తయికి అపోస్తుల పట్టం దొరికింది. ఎంత ఆశ్చర్యం, మత్తయి కూడా దీనిని ఆలోచించి ఉండరు కూడా. తన పేరున వచ్చిన చీటును అంగీకరించి 11 మంది అపోస్తులతో కలిసి సువార్త ప్రకటించుటకు ఒక కారకుడు అయ్యాడు.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా దేవుని పరిచర్య చేయమనే చీటు మీ పైన పడి మీకు ఆ పిలుపు రావచ్చు. ఒక ప్రసంగం ద్వారా, బైబిల్ ధ్యానం ద్వారా, పతిస్థితుల ద్వారా మీరు దేవుని పని చేయడానికి ప్రేరేపించబడవచ్చు. అప్పుడు మీరు కూడా మీ పిలుపును అంగీకరించి పరిచర్య చేయుటకు ముందుకు రండి, సేవకునిగా ముందుకు రండి. పైన చెప్పబడిన రెండు సంఘటనలో ఇద్దరు మీద చీటు పడినప్పడు తాము చేయగలిగినంత కార్యం వాళ్ళు చేసి తాము పొందుకున్న ఆ స్థానమునకు న్యాయము చేసి గర్వము తీసుకు వచ్చారు. మీ యొక్క పేరు పడితే మీరు కూడా దేవుని పరిచర్య చేయుటకు మీ వంతు మీరు చేసి మన దేశమునకు దీవెన కరముగా మీరు ఉండగలరు. వస్తారా?
- బ్రదర్. టి. శంకర్ రాజన్
ప్రార్థన అంశం:
గ్రామాలను సపోర్ట్ చేస్తున్న కుటుంబాలను దేవుడు దీవించేటట్లు ప్రార్థన చేద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250