Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 12.02.2021

దిన ధ్యానము(Telugu) 12.02.2021

మనలను అధిగమిస్తూన్నది ఏమిటి?

"దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి" - అపో.కార్యములు 6: 7

ఒక గ్రామంలో ఒక వృద్ధ దంపతులకు 7 ఎకరముల పొలము ఉండేది. పొలములో అనేక విధములైన పంటలను పండిస్తూఉండేవారు. సరిపడినంత వర్షం లేనందున బావిలో ఉన్న నీళ్లు అన్ని ఎండిపోయి ఆ బావిలో గల బండ రాళ్లు బయటకు కనిపించాయి. పంటలు అన్ని కూడా ఎండిపోవడం ప్రారంభించింది. ఆ సమయంలో వాళ్ళు దేవుని వైపు చూచి ప్రార్ధించడం ప్రారంభించారు. ఆయన బండను నీటిమడుగుగాను చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయు వాడు (కీర్తనలు 114: 8)అనే బైబిల్ వాక్యం వాళ్ళతో మాట్లాడటం ప్రారంభించింది. ఆ బైబిల్ వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా పట్టుకొని ఆ రాత్రి ప్రార్ధించడం ప్రారంభించారు. బండ రాతిని నీటి ఊటలుగా మార్చిన దేవుడా రాతి బండలు కల మా బావిలో మీరు నీరు దయచేయడానికి సమర్థులు కనుక నీటిని దయచేయండి అని ప్రార్ధించారు. తన ప్రార్ధనకు దేవుడు జవాబు ఇచ్చారు అనే నిశ్చయత తమ హృదయంలోనికి వచ్చే వరకు ప్రార్ధించారు. ఉదయమునే లేచి తమ పొలములో ఉన్న ఆ భావిని చూచినప్పడు బండ రాళ్లతో నిండిన ఆ బావిలో నీటి ఊటలు ఏర్పడి ఆ బావి అంత నీటితో నిండి యుండుట చూచి దేవున్ని స్తుతించారు. ఆ ప్రాంతంలో గల బావులు అన్ని కూడా ఎండిపోయి ఉన్నప్పుడు వీళ్ళ బావిలో నీళ్లు మాత్రం 9 ఎకరాలలో పంట పండించడానికి సరిపోయినంతగా దేవుడు దాయచేసారు. 

అబ్రాహాము ఆయన భార్య సార వృద్దాప్యంలో బిడ్డలు లేక ఉన్నారు. అయినప్పటికీ అబ్రాహాము యొక్క సంతతి వారు ఇసుక రేణువుల వలె చేస్తాను అని చెప్పిన దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు. దానిని బట్టి తన 100వ సంవత్సరంలో ఇస్సాకును కన్నారు.

ప్రియమైన వారలారా మన జీవితంలో కూడా బైబిల్ వాక్యముల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. మనము ఆ వాక్యమును పట్టుకొని ప్రార్థిస్తున్నామా? దేవుని మాటను పట్టుకొని ఉన్నామా లేదా అపవాది చేత కదల్చబడిఉన్నామా? ఆయన మాట పైన విశ్వాసం ఉంచితే విజయమే. ఆ మాటను విశ్వాసంలో విత్తగలిగితేనే అది విస్తారంగా ఫలించగలదు. అదేవిధంగా మన జీవితంలో కూడా విని వాక్యాన్ని విడిచి పెట్టె వారముగా కాకుండా బైబిల్ వాక్యం మనలో విత్తబడటానికి అది మనలో నాటుకు పోయి అభివృద్ధి చెందడానికి ఎటువంటి పరిస్థితులలోనైన వాక్యమును పట్టుకొని విజయము పొందేవారుగా ఉంధాం.
-    శ్రీమతి. వసంతి రాజమోహన్

ప్రార్థన అంశం:- 
నంబికై టి.విలో ఒక ప్రోగ్రాంకి 4500 రూపాయలు ఇచ్చి సపోర్ట్ చేసే కుటుంబాలు లేచేటట్లు ప్రార్థిద్దాం..

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)