Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 11.02.2021

దిన ధ్యానము(Telugu) 11.02.2021

కులాలు లేవు.

"ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదు” - అపో.కార్యములు 10:28

సృష్టించిన దేవుని దృష్టిలో అందరము సమానమే. ముట్టుకున్న అన్నింటిలో కులములు చూచుట మనుష్యుని గుణముగా మారిపోయింది. క్రైస్తవులు, పరిచర్య చేసేవారు దీంట్లో తప్పించుకోలేదు. కులము వలన పెద్ద సమస్య ఏమిటి అంటే ఒకే ఊరిలో రెండు సంఘములను కట్టి ఒకటి ఈ కులమునకు మరియొకటి ఆ కులమునకు అని విభజించి ఆరాధిస్తున్నారు. అనేక మిషనరీ సంస్థలు అవసరమైన చోట అలయములను కట్టలేని పరిస్థితి ఉంటే మరొకవైపు అదే ఊరిలో కులము పేరిట రెండు ఆలయములు కట్టుట వేదన కరమైన విషయం. కులానుసారముగా ఇలా విభజించుట న్యాయమేనా? అని ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. 

పరిశుద్ధ బైబిల్లో అపోస్తులకార్యములు 10వ అధ్యాయము చూచినప్పుడు పేతురునకు దేవుడు ఒక దర్శనం చూపించారు. దాంట్లో నాలుగు మూలలు కూడా కట్టబడిన దుప్పటితో ఆకాశమునుండి క్రిందకు వచ్చింది. దాంట్లో భూమి పైన గల నాలుగు కాళ్ళు జీవరాసులు, అడవి మృగములు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు, అన్నింటిని చూసారు. వెంటనే పేతురు దీనిని భుజించు అనే స్వరమును విన్నాడు. అందుకు పేతురు నేను అపవిత్రమైన దానిని ఎన్నడు తినలేదు అని అంటున్నాడు. కాని పేతురు విన్న స్వరము దేవుడు పవిత్ర పరచిన దానిని నీవు అపవిత్రముగా తలంచకుము అన్నదే. ఇలాగు మూడుసార్లు జరిగింది. అలాగే పేతురు యూదుడు కాని కొర్నేలి అను మనుష్యుని  ఇంటికి పిలవబడ్డాడు. దీని ద్వారా  ఎలాంటి మనిషిని కూడా అపవిత్రులు అని ఎంచకుండా దేవుడు ప్రతి ఒక్కరినీ పవిత్ర పరిచారు అని తెలియపరిచారు. ఎలాంటి పాటమో చూసారా.

దీనిని చదువుతున్న ప్రియమైన స్నేహితులారా!  మనము ఈ దినము ఎవ్వరిని కూడా అపవిత్రులు, పరిశుద్ధులు అని చూడకుండా జాగ్రత్తగా ఉందాం. కులాన్ని పెట్టుకొని దేవుడు పవిత్ర పరిచిన మనుష్యులను మనము అపవిత్రులుగా ఎంచవద్దు. బేధము లేదు కులమును బట్టి హెచ్చు, తగ్గు అని చెప్పడం పాపం అని చెప్పిన భారత కవి యొక్క మాటలను జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రభువుని అంగీకరించిన ప్రతిఒక్కరు అపోస్తులకార్యములలో చెప్పబడిన పైన ఉన్న సంఘటనను ధ్యానించి మనలను మనము సమర్పించు కొనిన యెడల మనలను కూడా ప్రభువు పేతురు వలె మార్చి వాడుకుంటారు.
-    బ్రదర్. టి. శంకర్ రాజన్

ప్రార్థన అంశం:-
యూట్యూబ్, ఫేసుబుక్, ట్విటర్ ద్వారా ప్రచారం అవుతున్న మన చిన్నపిల్లల, యవ్వనస్తులు కార్యక్రమాలు ద్వారా దేవుడు అనేకులకు రక్షించేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)