దిన ధ్యానము(Telugu) 10.02.2021
దిన ధ్యానము(Telugu) 10.02.2021
అవకాశమును వాడుకుందాం.
"అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను" - అపో.కార్యములు 1:17
ఒక దేశమును పరిపాలించిన రాజుకు ఒక అలవాటు ఉండేది. తనకు నచ్చినప్పుడు తన దేశము చుట్టూ తిరిగి వచ్చేవారు. అప్పుడు అవసరతలో ఉన్న వ్యక్తుల యొద్దకు వెళ్లి నీకు అవసరమైనది ఏమిటి అని అడిగే వారు. అవతల వ్యక్తి ఆడిగినది ఏదైనా సరే దానిని వారికి ఇచ్చి సంతోషించే వారు. ఆలాగుననే ఒక దినము చాలా మురికి వస్త్రం ధరించి చేతులు కాళ్ళు పుండ్లుతో నిండిన ఒకాయనను చూసారు. ఆయన దగ్గర తన రథమును అపి నీకు ఏమి కావాలి అని అడిగారు అందుకు ఆయన ఏమి ఆలోచించ కుండా నేను ఎప్పుడు మీతో పాటు ఉండాలి అని చెప్పారు. రాజు వెంటనే అతనిని తన భవనమునకు తీసుకు వెళ్లారు. అక్కడ అతనిని శుభ్రం చేసి తన పుండ్లుకు మందు రాసి తన గాయములను కట్టి అందమైన విలువ కలిగిన వస్త్రం దరింపజేయమని అజ్ఞాపించారు. ఆయన ఎప్పుడూ తనతోపాటు తన భవనములో ఉండేటట్లు చూసుకున్నారు. ఆ రాజ భోగం ఆయన జీవితంలో ఒక ఆశ్చర్యం కలిగించింది. దీనిని చూసిన మిగిలిన పనివారు మనలను రాజు అడిగినప్పుడు మనం ఎన్నడు ఈవిధముగా అడగలేదే మనకు ఇవ్వబడిన అవకాశమును కొలిపోయమే అని బాధపడ్డారు.
ఇలాగుననే ఇస్కరియోతు యూదాకు యేసుక్రీస్తుతో కలిసి జీవించే అవకాశం వచ్చింది. ఇంచుమించు మూడున్నర సంవత్సరాలు ఆయనతో ఉన్నాడు. అనేక అద్భుతాలు చూసాడు. నిత్యజీవితము గురించి గ్రహింపు వచ్చింది కాని పరితాపకరమైన విషయం. మహోన్నతుడైన దేవునితో జీవించే భాగ్యాన్ని విడిచి పెట్టి 30 వెండి నాణెముల కొరకు యేసుక్రీస్తును అప్పగించారు. అది మాత్రమే కాదు అపోస్తులకార్యములు 1:18 లో చెప్పబడినట్లు
ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చి యొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను. యేసుక్రీస్తుతో జీవించే ఒక అవకాశము దొరికినప్పటికి దానిని ఇస్కరియోతు యూదా కోల్పోయాడు. కాని యేసుక్రీస్తుతో సిలువలో వేయబడిన దొంగ అయితే తనకు దొరికిన అవకాశాన్ని వాడుకొని యేసయ్యను చూచి ప్రభువా మీరు మీ రాజ్యంతో వచ్చిన్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగాడు.
దీనిని చదువుతున్న మనము రక్షింపబడి ఈ లోకాశలలో పడి ఏదో ఒక పాపములో ఇరుక్కుపోయి అనేక మార్లు ప్రభువు హెచ్చరించినను యేసయ్యతో జీవించే నిత్య జీవితమును పొందుటకు అర్హత లేని వారిగా జీవిస్తున్నామా అని ఆలోచించిచూద్దాం. ప్రాణముతో ఉన్నంతవరకే మనకే అవకాశం. మరణించిన తరువాత ధనవంతుని వలె ఎంత అంగలార్చిన ప్రయోజనము లేదు. మారుమనస్సు పొందుదాం దేవుడు అనుగ్రహించే నిత్య జీవితము కొరకు సిద్ధపడదాం.
- బ్రదర్. పి.వి.విలియమ్స్
ప్రార్థన అంశం:-
నంబికై టి.వి లో ప్రచారం చేయబడుతున్న టి.వి కార్యక్రమలా ద్వారా అనేక మంది రక్షించబడేటట్లు ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250