దిన ధ్యానము(Telugu) 09.02.2021
దిన ధ్యానము(Telugu) 09.02.2021
మారుమనస్సు, రక్షణ.
"...ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు" - అపో.కార్యములు 16: 31
ఒక దేవాలయపు బోధకుడు సంఘం ఇచ్చే దశమభాగం మరియు కానుకలు తీసుకొని మిషన్ ఆఫీసుకు వెళ్తున్నారు. మార్గంమధ్యలో నలుగురు దోపుడు దొంగలు అతని యొద్ద ఉన్న డబ్బును లాగేసుకున్నారు. ఇది దేవుని పరిచర్య కొరకు వాడబడవలసిన డబ్బు అని ఎంత చెప్పినా ఆయనను కొట్టేసి డబ్బును లాగేసుకున్నారు. బోధకుడు ఈ విషయాన్ని ఆఫీసులో చేప్పి ప్రార్ధించమని చెప్పారు. ఆరు దినములు తరువాత ఆ బోధకుని యొద్దకు ఆ దొంగలు వచ్చి అయ్యా మమ్మ ల్ని క్షమించండి ఈ డబ్బును తీసుకొని మందుల షాపుకు మరియు తప్పిదమైన కార్యములకు వాడడానికి ప్రయత్నించినప్పుడు మా చేతులు పనిచేయకుండ ఉండిపోయాయి మేము ఏమి చేయలేకపోయాము. అప్పుడే మేము చేసిన తప్పు మాకు అర్ధం అయింది. మేము ఇక దొంగతనం చేయకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి అని మారుమనస్సు గల హృదయాముతో అడిగారు. బోధకుడు యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైన ప్రేమను ఆయన యెక్క క్షమించే గుణమును చెప్పి క్రీస్తు లోనికి వాళ్ళను నడిపించారు. కొద్ది దినాల్లో వాళ్ళ కుటుంబములు కూడా మారి వాళ్ళు చేసే దొంగతనమును విడిచిపెట్టారు.
బైబిల్లో కూడా పౌలు, సీల చెరసాలలో బందింప బడినప్పుడు మధ్య రాత్రిలో దేవున్ని పాటల ద్వారా స్తుతించడం ప్రారంభించారు. వెంటనే చెరసాల పూనాది కదలడం ప్రారంబించింది. ఆ చెరసాల అధికారి వాళ్ళు తప్పించు కున్నారో ఏమో అని తన ప్రాణాన్ని తీసుకొనుటకు ప్రారంభించారు. వెంటనే దానిని చూసిన పౌలు అతనిని అపి మేము ఇక్కడే ఉన్నాము అన్నారు. తరువాత చెరసాల అధికారి పౌలు యొద్దకు వచ్చి మేము రక్షించబడుటకు ఏమి చెయ్యాలి అని అడిగారు. అప్పుడు ఆయన మాత్రమే కాదు ఆయన కుటుంబం అంతా కూడా రక్షించబడి బాప్తీస్మం తీసుకున్నారు.
నా ప్రియమైన వారలారా! రక్షణ యెహోవాది. ప్రతి మనుష్యుడను మార్చుటకు ఆయన సమర్ధవంతుడు. ఎంతో కఠినమైన మనస్సు కలవారిని కూడా మార్చుట ఆయనకు సులువైన కార్యమే. ఇలాగు రక్షింపబడిన ఒకరి ద్వారా సంపూర్ణ కుటుంబము దేవుని యొద్దకు రాగలరు అనేదానికి ఈ రెండు నిజ సంఘటనలు ఉదాహరణ. ఒక వేళ మీరు ఈ విధముగా ఆలోచించవచ్చు నేను యేసుక్రీస్తును అంగీకరించి ఆయన ప్రేమను రుచి చూసి ఉన్నాను కాని నా కుటుంబం ఇంకా రాలేదే, వచ్చే పరిస్థితి కూడా కనిపించలేదే అని కలత చెందవచ్చు. దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు అందరూ రక్షించబడాలి అన్నదే ఆయన యొక్క చిత్తం. కచ్చితంగా మీ కుటుంబంలో ఆ చిత్తం నెరవేర్చబడుతుంది.
- శ్రీమతి. సరోజా మోహన్ దాస్.
ప్రార్థన అంశం:-
బైబిల్ కాలేజీలో పిల్లలు కూర్చొనుటకు కుర్చీలు కొనడానికి ఆర్థిక సహాయం దేవుడు దయచేయులాగున ప్రార్థిద్దాం.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250