దిన ధ్యానము(Telugu) 07.02.2021 (Kids Special)
దిన ధ్యానము(Telugu) 07.02.2021 (Kids Special)
ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం
అందమైన పువ్వుల తోట
"నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము" - కీర్తనలు 40: 8
హాలో పిల్లలు! యేసు ప్రభువు నామములో మీ అందరికి శుభములు. మీరందరు బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకో తెలుసా మేమందరము మీకొరకు ప్రార్థన చేస్తున్నాము. యేసయ్య ప్రార్థన వింటారు కదా! ఆయన లేకుండా మనము ఏమి చెయ్యలేము. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. మనలను ఇప్పటివరకు సంరక్షించి నడిపించిన యేసయ్యకు చేతులు జోడించి కృతజ్ఞతలు చెల్లిద్దమా ఓకే, కధ వినడానికి సిద్ధంగా ఉన్నారా?
అది ఒక అందమైన పువ్వుల తోట. మంచి సువాసన ఇచ్చే రంగురంగుల పువ్వులు గుత్తు గుత్తులుగా పూస్తున్నాయి. ఆ తోట దాటుకుని వెళ్తున్నవారు ఎవ్వరు కూడా ఆ తోట అందాన్ని ఆస్వాదించకుండ వెళ్లారు. మీరు కూడా అలాంటి రోజాపువ్వుల తోట, సన్ ఫ్లవర్ తోట చూసి ఉంటారు కదా. చూడటం మాత్రమే కాదు ఆ తోటలోనికి దిగి మొబైల్ తో సెల్ఫీ దిగి మీ ఫ్రెండ్స్ కి చూపించి సంతోషిస్తారు కదా. దేవుని యొక్క సృష్టి అందమైనది.
ఆ తోటలోనే ఆ తోట మాలి ఆ మొక్కల యొక్క ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. ఎదుగుతూ పువ్వులు. పూసే సమయానికి పురుగులు వచ్చి ఆ మొక్కలను తినేస్తాయి. అందువలన ఎదురు చూసిన పంట దొరకకుండా పోతుంది. అందుకని ఆ తోట మాలికి ఒక ఆలోచన వచ్చింది. తియ్యని రుచికరమైన పురుగుల మందును ఆ మొక్కలపైన వేశారు. రాత్రి సమయంలో విషపూరితమైన పురుగులు వచ్చి ఆ మొక్కలను తినడం ప్రారంభించాయి. తిన్న కాసేపటికి చచ్చి క్రింద పడిపోయింది. కొన్ని దినాల్లో ఆ మొక్క ఎదిగి ఎక్కువగా ఫలించింది. దానిని చూసిన ఆ తోట మాలికి యనలేని సంతోషం.
బుజ్జి పిల్లలు మీరుకుడా ఎదుగుతూ వస్తున్నకొలది మిమ్మల్ని మంచి పిల్లలుగా ఉండనివ్వకుండ సాతానుడు మిమ్మల్ని పాపము చేయుటకు ప్రేరేపిస్తుంటాడు. తీపి కలిసిన విషము వలె పాప సంతోషాన్ని చూపిస్తుంటాడు. దానిని మీరు అంగీకరిస్తే మీకున్న మంచి పేర్లను పాడుచేసి మీ జీవితాన్నే నాశనం చేసేస్తాడు. అందమైన పువ్వుల తోట వలె ఉంటున్న మీ జీవితాన్ని అంద విహీనముగా చేయడమే సాతాను యొక్క లక్ష్యం. పాపాన్ని విడిచి వెళ్ళాలి అంటే యేసయ్య మీతో ఉంటేనే అవుతుంది. మీ సత్ క్రియలు ద్వారా యేసయ్యకు ప్రియమైన పిల్లలుగా జీవించుటకు సమర్పిస్తావా? యేసయ్యతో ఉంటే ఎప్పుడు మీ జీవితంలో పువ్వులు పూస్తూ ఫలించి ఇతరులను సంతోషింపజేసే జీవితంగా మారుతుంది. ఓకేనా!
- సిస్టర్. దెబోరా.
ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864,
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002,
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250
ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250