Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 04.02.2021

దిన ధ్యానము(Telugu) 04.02.2021

ధైర్యముతో లెమ్ము:

"అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై... " - అపో.కార్యములు 2: 4

వేల్స్ దేశములో ఇవాన్స్ రాబర్ట్ అనే యవ్వనస్తుడు ప్రార్థిస్తున్న సమయంలో వేల్స్ దేశములో ఉజ్జీవాన్ని పంపించబోతున్నాను ఈ ఉజ్జీవపు ఆగ్ని ఇంగ్లాండ్, ఐరోపా, ఆఫ్రికా మరియు ఆసియా వరకు విస్తరిస్తుంది అని దేవుడు అతనికి చెప్పారు. ఇవాన్స్ తాను పొందుకున్న దర్శనములను సంఘములకు ప్రసంగించుటకు ఆశక్తి కలిగి ఉండేవారు . కాని అవకాశము ఇవ్వబడలేదు. చివరికి బోధకుడు వచ్చే వారం బుధవారం రాత్రి ప్రార్ధనలో ప్రసంగించు, ఎవరైనా వింటారేమో చూడు అని ఆ బోధకుడు ఇవాన్స్ తో అన్నారు. ఇవాన్స్ ప్రసంగం విన్న ఆ బోధకుడు మరియు 17 మంది దేవుని అగ్ని చేత తాకబడ్డారు. యవ్వనుడైన ఇవాన్స్ దేవుని మాటలను దైర్యంగా ప్రసంగించారు. ఇతని సులువైన సందేశం అనేకులను తాకింది. ఉజ్జీవపు అగ్ని చాలా వేగంగా విస్తరించడం ప్రారంబించింది. తరువాత 30 రోజుల్లో 37,000 మంది వారి పాపములను ఒప్పుకొని మారుమనస్సు పొంది యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు.5నెలలో ఒక లక్ష మంది రక్షించబడ్డారు. ఇలాగు ఆ దేశం అంతా కూడా ఉజ్జీవం విస్తరించింది. 

పరిశుద్ధ గ్రంధమైన బైబిల్లో యేసు క్రీస్తు పరమునకు ఆరోహణమైన తరువాత తాను వాగ్దానం చేసిన పరిశుద్దాత్మను యెరూషలేము మేడ గదిలో వేచియున్న వారి మీద కృమ్మరించారు. ఆ దినము పేతురు యొక్క ప్రసంగమును విని 3000 మంది మారు మనస్సు పొంది రక్షించబడి సంఘంలో చేర్పించబడ్డారు. ఎక్కువ చదువరి కాకపోయినా చేపలు పట్టే పేతురు ద్వారా గొప్ప ఉజ్జీవం ఏర్పడింది. అపోస్తులలు వెళ్లిన చోటు అంతా కూడా అద్భుత ఆశ్చర్య కార్యములు జరిపించి దేవుడు తనను ప్రత్యక్ష పరిచారు. ఇలాగు అపోస్తులుల కాలంలో గొప్ప ఉజ్జీవం ఏర్పడింది. 

ప్రియమైన వారలారా! మీకు కూడా భారతదేశం యొక్క ఉజ్జీవమును గూర్చి ఆశక్తి ఉండవచ్చు. నా హృదయంలో ఇవాన్స్ రాబర్ట్ వలె అపోస్టులుల వలె ఆత్మలను గూర్చిన భారం నా జీవితంలో లేదే అని మీరు అంగలార్చవచ్చు. ఇలాంటి భారం తనంతట తానే రాదు కాని పరిశుద్దాత్మ దేవుడు మనపై కృమ్మరించబడినప్పుడు ఇలాంటి భారం పొందుకోగలము. భారతదేశ ఉజ్జీవంలో నా బాగము ఏమిటి నేను ఏమి చెయ్యాలి అనే ఆశక్తి ఉండిన యెడల ఆత్మల భారం కలుగుతుంది. తమిళనాడు రాష్టంలో 4% మాత్రమే క్రైస్తవులు ఉన్నారు. అనగా 100 మంది క్రైస్తవులుగా మారాలి అంటే ఒక క్రైస్తవుడు 25మందిని దేవుని కొరకు సొంతం చేయాలి. ఇలాగు లెక్క చూసిన యెడల ఇది నావలన సాధ్యమేనా అని అనిపించవచ్చు. కాని పరిశుద్దాత్మతో నింపబడిన ఎవ్వరైనా ఖచ్చితంగా చేయగలరు. సాధారణంగా యవ్వనస్తుడైన ఇవాన్స్, చదువులేని పేతురు ఆత్మచేత నింపబడినప్పుడు వీళ్ళ ద్వారా దేవుడు కార్యములు చేశారు కదా. ఖచ్చితంగా మీ ద్వారా కూడా చేస్తారు. ధైర్యం తెచ్చుకొని లేవండి ఉజ్జీవంలో మీరు కూడా పాలిబాగస్తులుకండి. 
-    బ్రదర్. పి.స్టీవ్ మ్యాత్యు

ప్రార్థన అంశం: 
మనతో కలిసి పరిచర్య చేస్తున్న పాట్నర్స్ మిషనరీల యొక్క ప్రయాణంలో దేవుని హస్తం తోడైయుండులాగున ప్రార్ధించండి.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)


Loading...