Village Missionary Movement

கிராம மிஷனரி இயக்கம்


దిన ధ్యానము(Telugu) 02.02.2021

దిన ధ్యానము(Telugu) 02.02.2021

క్రైస్తవులు ఎవరు?

"...మొట్ట మొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి" - అపో.కార్యములు 11: 26

విదేశాల్లో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్లే క్రైస్తవులు అని పిలువబడతారు. మన దేశంలో క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాళ్లంతా తమను క్రైస్తవులు అని పిలిపించుకుంటారు. కాని బైబిల్ అయితే క్రీస్తు యొక్క శిష్యులే క్రైస్తవులు అని తేటపరుస్తుంది. అలా అయితే శిష్యులు ఎవరు అని గ్రాహిస్తేనే క్రైస్తవులు అని పిలవబడుటకు అర్హతకలిగిన వారిగా ఉంటారు అనే దాన్ని గ్రహించుకోగలం.

ఒకరినొకరు ప్రేమించే వారు (యోహాను 13:35). అధికముగా ఫలించేవారిని(యోహాను 15:8) యేసుక్రీస్తు శిష్యులుగా పిలుస్తున్నారు. తమకు కలిగినవన్నింటిని ఆపేక్షించే వారు ఎవ్వరు కూడా శిష్యులుగా ఉండలేరు అని యేసయ్య చెబుతున్నారు. అనగా తనకు శిష్యులుగా ఉండుటకు ఆయన వలె నిస్వార్థంగా శ్రమలను సహించే గుణ లక్షణములు కలిగి ఉండాలని చెబుతున్నారు. 

క్రైస్తవ కుటుంబంలో మనం జన్మించుట వలన మనము క్రైస్తవులము కాము. బిస్కట్ డబ్బాలో ఎలుక పిల్లలు పెడితే ఎలుక పిల్లలు బిస్కట్ అయిపోవు. ఎప్పుడో ఒక దినము పాపము విడిచి పెట్టి, మారుమనస్సు పొంది, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాము అని సంతృపిలో ఉండిపోలేము. మారుమనస్సుకు తగిన ఫలములను అనుదినము ఫలించాలి. ఆత్మ ఫలములు, సమస్త సత్ క్రియలు, నీతిలో, యదార్థతలో కనిపిస్తుంది. ఫలించని అంతరంగ కార్యములకు లోబడకుండా వాటిని గద్దించాలి. ఫలము లేని వారిగా ఉండకుండా సత్ క్రియ చేయుట నేర్చుకోవాలి. దేవుని కొరకు ఫలించే వారిగా మనము సమర్పించినప్పుడు పరిశుద్దాత్మ దేవుడు బైబిల్ వాక్యములు ద్వారా మనతో మాట్లాడి మనలను ఫలించే వారిగా చేస్తారు. యేసయ్య తప్ప ఎవ్వరు మనకు సహాయము చేయలేరు. ఫలించే ద్రాక్ష వల్లినైన యేసుక్రీస్తు పైన అనుకొని మనము ద్రాక్షావల్లిగా ఉండేటప్పుడే ఆయనలో గల ఫలములతో  మనము మిక్కిలి ఫలించగలము. 

ఇలాగు బైబిల్ సలహాల ప్రకారముగా యేసుక్రీస్తు శిష్యులుగా జీవించే వారే క్రైస్తవులు. మనము బైబిల్ చెప్పే క్రైస్తవులుగా జీవిస్తున్నమా? ఆలోచిద్దాం. 
-    శ్రీమతి. గీతా రిచర్డ్

ప్రార్ధన అంశం:
వెయ్యి మంది కలిసి కూర్చొని ఆరాధించ గలిగిన ప్రార్థనా గుడారపు కట్టడ పనులకు అవసరమైన ధన సహాయము దేవుడు దయ చేయులాగున ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Androidapp: https://play.google.com/store/apps/details?Id=com.vmmorg.template.msmapp&showAllReviews=true

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250


Comment As:

Comment (0)